Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిగ్ బాస్ షోలోకి వెళ్లడంపై సెన్సేషనల్ కామెంట్స్.. పశ్చాత్తాపడుతున్న నోయల్
బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇవ్వడానికి కొందరు ఆలోచిస్తారు. దాదాపు చాలా మంది బిగ్ బాస్‌లోకి రాకుండా ఉండేందుక ప్రయత్నిస్తుంటారు. అయితే కొందరు తామేంటో నిరూపించుకునేందుకు కోరి మరి వస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఇంకొందరు షోలో కంటెస్టెంట్లుగా వచ్చి.. బయటకు వెళ్లాక పశ్చత్తాపడుతుంటారు. బిగ్ బాస్ షోకు వెళ్లడమే పెద్ద తప్పు అన్నట్టుగా మాట్లాడుతుంటారు.
గతంలో పున్నర్నవి..
బిగ్ బాస్ షోలోకి వెళ్లి ఏం నేర్చుకున్నావ్ అని పునర్నవిని అడిగితే అందరూ ఆశ్చర్యపోయే సమాధానం చెప్పింది. బిగ్ బాస్ షోకి వెళ్లకూడదని నేర్చుకున్నాను అంటూ కౌంటర్ వేసింది. బిగ్ బాస్ వల్ల పునర్నవికి మంచి ఇమేజ్ వచ్చినా కూడా షోకి వచ్చినందుకు విముఖత వ్యక్తం చేసంది.
తాజాగా నోయల్..
పునర్నవిలానే నోయల్ కూడా వెరైటీగా కామెంట్లు చేశాడు. తాజాగా నోయల్‌ను హారిక బ్రదర్ వంశీ, హారిక ఫ్రెండ్ నిఖిల్ ఇంటర్వ్యూ చేశారు. నోయల్ ఇంత వరకు ఎవ్వరికీ కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అలాగే హారిక బ్రదర్ వంశీ నోయల్‌కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. నోయల్ ఇంటికి వెళ్లి మరీ నిఖిల్, వంశీలు ఇంటర్వ్యూ చేశారు.
మనకు అవసరమా?
బిగ్ బాస్ షోకి వెళ్లి ఏం నేర్చుకున్నావ్ అని నోయల్‌ను అడిగితే వింత సమాధానం చెప్పాడు. అసలు ఎందుకు వెళ్లానా? అని అనుకున్నట్టు తెలిపాడు. అది మనలాంటి వాళ్లకు సెట్ కాదు.. వెళ్లకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపడుతున్నట్టు పెదవి విరిచాడు నోయల్.
Recommended Video
హారికకు సపోర్ట్..
అయితే సిటీకి దూరంగా ఎక్కడో ఎందుకు ఉంటున్నావ్ అని అడిగితే కూడా వింత సమాధానం చెప్పాడు.. ప్రేమించిన వాళ్లకు దూరంగా ఉండాలి... ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నట్టుగా చెప్పుకొచ్చాడు. హారికను ఇలా బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నందుకు నిఖిల్‌కు నోయల్ థ్యాంక్స్ చెప్పాడు. ఇలాంటి సమయంలో ఎవ్వరూ ఇలా చేయరంటూ నోయల్ ఎమోషనల్ అయ్యాడు.