ఇంటింటికి తిరిగి అమ్మ పని చేసేది.. అదే పెద్ద అవార్డ్.. నోయల్ ఏడిపించేశాడు!
బిగ్‌బాస్ షోలో ఆరో వారం అందర్నీ ఏడిపించేశాడు. చిన్న నాటి ఫోటోలను చూపిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుకు చేశాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ ఎమోషనల్ అయ్యారు. ప్రతీ సీజన్‌లో ఉన్నట్టుగానే ఈ సారి కూడా కంటెస్టెంట్ల చిన్న నాటి ఫోటోలను చూపించాడు బిగ్ బాస్. ఇక వాటిని చూసిన కంటెస్టెంట్లు తెగ ఎమోషనల్ అయ్యారు. ఆ తరువాత తమ కుటుంబ నేపథ్యం, పడిన కష్టాలు చెబుతూ అందర్నీ టచ్ చేశారు. అందులో నోయల్ తన కుటుంబ నేపథ్యం చెబుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఊరు నుంచి పట్నంకు..
మా చదువుకోసమని తల్లిడండ్రులు సిటీకి వచ్చారు. మా అమ్మ ఇంటింటికి తిరిగి పని చేసేది. అలా వందరూపాయలు వచ్చేది. మా నాన్న అన్ని పనులు చేసేశాడు. ఇస్త్రీ, మేస్త్రీ పని ఇలా అన్ని రకాలవి చేస్తూ సంపాదించేవాడు. అయితే నాకు సినిమా పచ్చి పట్టడానికి కారణం మా నాన్న అని నోయల్ చెప్పుకొచ్చాడు.

చిరంజీవి ఫ్యాన్..
ఇది ప్రామీస్‌గా చెబుతున్నా.. మా నాన్న చిరంజీవి ఫ్యాన్. మా ఇంట్లో టేప్ రికార్డ్ ఒక్కటే ఉండేది. చిరంజీవి సినిమా ఆడియో క్యాసెట్లు వస్తే చాలు ఫస్ట్ కొనేవాడు. ఇంట్లో ఆ టేప్ రికార్డులో ఆ పాటలు మోత మోగించేవాడు. అలా చిన్నతనం నుంచి సినిమా పిచ్చి మొదలైందని నోయల్ తెలిపాడు.

ఈ నవ్వు మా అమ్మ..
నన్ను అందరూ అడుగుతారు.. ఇలా ఎప్పుడూ హ్యాపీగా ఎలా ఉంటావ్ నవ్వుతూ ఉంటావ్ అని.. ఇది మా అమ్మ దగ్గరి నుంచే నేర్చుకున్నాడు. ఈ నవ్వు మా అమ్మదే. మా వాళ్లను ఎప్పుడో ఓసారి తలెత్తుకునే చేయాలని ఎదురుచూశాను. అలా ఈగ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఎక్కడ కనిపించావ్ రా అని ఫ్రెండ్స్ అన్నారు.
Recommended Video

అదే అవార్డు..
ఓ వైపు ధృవ ఆడుతోంది.. మరో వైపు నా సినిమా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఆడుతోంది. సంధ్య 35 ఎంఎంలో మా నాన్నను నా సినిమాకు తీసుకెళ్లాను. ఎవ్వరూ గుర్తు పట్టరేమోనని అనుకున్నాను. కానీ ఇంటర్వెల్‌లో అందరూ వచ్చి సెల్పీ అడుగుతుంటే మా నాన్న షాక్ అయ్యాడు. అప్పుడు నేను మా నాన్నను సెల్ఫీ ఇవ్వమని అడిగాను. అదే నా జీవితంలో పెద్ద అవార్డు లాంటిదని నోయల్ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











