నోయల్ తండ్రి ఢిఫెన్స్ ఉద్యోగి.. బయటపడ్డ మోసం.. నెటిజన్ల కామెంట్లు వైరల్
బిగ్‌బాస్ షోలో మాట్లాడే ప్రతీ ఒక్కటి రికార్డ్ అవుతుంది. తరువాత ఎప్పుడైనా తాము ఆ మాటలు అనలేదు.. మాకు తెలియదని ఎవరైనా బుకాయిస్తే వీడియోలు ప్లే చేసి మరీ అడ్డంగా బుక్ చేస్తారు. అయితే ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు ఎంత నిజాయితీగా ఉండి నిజాలు మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే చూసే జనాలు కూడా తక్కువేమీ తినలేదు. కంటెస్టెంట్లు చెప్పిన వాటికి కరిగిపోయి ఓట్లు వేసే వారెవ్వరూ లేరు. నిజాయితీ ఉందా లేదా? ఆట ఆడుతున్నాడా లేదా? నిజాలే చెబుతున్నాడా? ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు.

మొన్నటి టాస్క్‌లో..
కంటెస్టెంట్ల చిన్ననాటి ఫోటోలను చూపించిన బిగ్ బాస్ అందర్నీ ఏడిపించేశాడు. ఆ ఫోటోలు చూసి ఒక్కొక్కరు భోరున విలపించారు. అనంతరం జీవితంలోని అనుభవాలు, ఆ ఫోటోలతో ఉన్న మెమోరీని షేర్ చేసుకోవాలని బిగ్ బాస్ తెలిపాడు. ఈ క్రమంలో నోయల్ తన ఫ్యామిలీ గురించి చెప్పి ఏడిపించేశాడు.

తండ్రి అలా..
నోయల్ తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ... అమ్మ ఇంటింటికి తిరిగి పనులు చేస్తే వంద రూపాయాలు వచ్చేవని అన్నాడు. తండ్రి అన్ని రకాల పనులు చేసేవాడని డైలీ లేబర్ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఇస్త్రీ, మేస్త్రీ పని ఇలా అన్ని రకాలుగా చేసే వాడని తెలిపాడు.

వికిపీడియాలో దొరికిపోయాడు..
అయితే నోయల్ చెప్పిన వాటికి అతని వికిపీడియాలో ఉన్న వాటికి ఎంతో తేడా ఉంది. మొదటగా ఆయన తండ్రి డిఫెన్స్ రిటైర్డ్ ఆఫీసర్ అని ఉంది. ఆపై కొంత సేపటికి డైలీ లేబర్ అని మారిపోయింది. అయితే ఈ రెండింటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను తీసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Recommended Video

సింపతీ కోసమే..
తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అయినా తప్పుగా చెప్పాడని సింపతీ ఓట్ల కోసమే అలా చేశాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే నోయల్ ఫ్యాన్స్ మాత్రం అది గతంలోని అని చెప్పాడు.. అప్పుడు ఆ పనులు చేసి ఉండొచ్చని మద్దతు తెలుపుతున్నారు. నోయల్ పీఆర్ టీం ఇలా వికిపీడియాలో మార్చడంపై ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











