For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హక్కు వాళ్లకు తప్ప ఎవ్వరికీ లేదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్

    |

    మామూలుగానే సెలెబ్రిటీలపై ట్రోల్స్ ఎక్కువగా నడుస్తుంటాయి. సెలెబ్రిటీలన్నాక వారిని ట్రోల్ చేయడం లక్ష్యంగా కొందరు ఉంటారు. అలాంటిది బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు వచ్చాక ట్రోలింగ్ చేయకుండా ఉంటారా. బిగ్ బాస్ టీం చూపించే గంట షోతో జనాలు వారిని డిసైడ్ చేసేస్తారు. లోపల ఏం జరుగుతోందన్నది ఎవ్వరికీ ముఖ్యం కాదు. ప్రసారం చేసిన ఆ గంటలో కంటెస్టెంట్లలో అభిప్రాయాలను ఏర్పర్చుకుంటారు. ట్రోల్స్ చేస్తుంటారు. అభిమానులుగా మారుతారు. అయితే ఈ ట్రోల్స్‌పై నోయల్ సీరియస్ అయ్యాడు.

     ట్రోల్స్‌పై అందరూ సీరియస్..

    ట్రోల్స్‌పై అందరూ సీరియస్..

    బిగ్ బాస్ షోలో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్లందరూ ఈ ట్రోల్స్ వల్ల పడిన బాధలేంటో కళ్లకు కట్టినట్టు చెప్పారు. వితికా షెరు మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో అందరూ తమ వేదనను పంచుకున్నారు. బిగ్ బాస్ షో సమయంలో వచ్చిన ట్రోల్స్ వల్ల డిప్రెషన్‌కు గురయ్యామని, దారుణంగా కామెంట్లు చేశారని వాపోయారు. నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయండి కానీ మిగతా వాళ్లను టార్గెట్ చేసి ట్రోల్ చేయకండి రిక్వెస్ట్ చేశారు.

     తాజాగా నోయల్ సైతం..

    తాజాగా నోయల్ సైతం..

    అయితే తాజాగా నోయల్ సైతం ఇలాంటి ఓ సందేశాన్నే ఇచ్చాడు. కంటెస్టెంట్లందరూ మంచి వాళ్లేనని, వారిని ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నించాడు. నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయడం తప్పు కాదు కానీ వేరే వాళ్లను, పైగా ఆడ వాళ్లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారని అది తప్పని చెప్పుకొచ్చాడు.

    ఆ హక్కు వారికే..

    ఆ హక్కు వారికే..

    కంటెస్టెంట్లను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు, యెదవలని ముద్ర వేస్తున్నారు.. అలా డిసైడ్ చేసే హక్కు ఎవరికీ లేదని.. అది వాళ్ల పేరెంట్స్‌కు మాత్రమే ఉంటుంది.. ఎందుకంటే పిల్లల గురించి పేరెంట్స్‌కు మాత్రమే తెలుస్తుందని దయచేసి ట్రోల్స్ చేయకండని నోయల్ వేడుకున్నాడు.

    Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
    నోయల్‌పైనా..

    నోయల్‌పైనా..

    బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో నోయల్‌పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. తన తండ్రి విషయంలో అబద్దం చెప్పాడని, డిఫెన్స్ ఉద్యోగి అయినా కూడా రోజూ వారి వేతనానికి పని చేశాడంటూ అబద్దం చెప్పాడని రూమర్లు వచ్చాయి. కానీ తరువాత అవన్నీ తప్పుడు వార్తలను నోయల్ సోదరుడు క్లారిటీ ఇచ్చాడు.

    English summary
    Bigg Boss 4 Telugu Noel Realised About Entry As Contestant, Bigg Boss 4 telugu Rahul Sipligunj Comments On sohel and ariyana, Avinash And Monal Are In Danger Zone, Avinash And sohel About Race To Finale Task, Harika About Sohel In Race To Finale Task, Avinash Ariyana And Monal Out From Finale Task, Bigg Boss 4 telugu week 13 Avinash Loses control In Finale Task, All Contestants Followed Abhijeet Formula, week 12 Akhil Sohel Afraid In Confession Room, Akhil Counter To Avinash, Bigg boss 4 Telugu Jabardasth Artist Bullet Bhaskar ABout Abhijeet, Week 12 Akhil Fires on Sohel About Abhijeet, Akhil And Monal dating, Avinash ariyana Discussion, Jabardasth Artist Campaign About Avinash,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X