పాపం నోయల్ అడ్డంగా బుక్కయ్యాడు.. ఆ మాటలు అనకుండా ఉండాల్సింది!!
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో ముందుగానే ప్రిపేర్ అయి పక్కా ప్లాన్‌తో దిగిన కంటెస్టెంట్ నోయల్. అసలే మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తన అనుభవాన్నంతా నోయల్‌కు ధారబోసి, హితబోధ చేసి పంపించి ఉంటాడు. ఎలాంటి సమయాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా పూసగుచ్చినట్టు చెప్పి ఉండొచ్చు గానీ.. లోపల ఏం జరుగుతోంది.. బయట కూడా అలానే కనిపిస్తుందనుకోవడం పొరబాటు. అసలే ఈసారి కట్టప్ప అంటూ అందరిలోనూ ఓ భయాన్ని కలిగించాడు బిగ్‌బాస్.

కట్టప్ప చుట్టూ..
బిగ్‌బాస్ మొదటి వారం మొత్తం కట్టప్ప చుట్టే తిరుగుతోంది వ్యవహారం. ఇప్పటికే మూడు సార్లు దీనిపై చర్చ పెట్టించాడు. మొదటిసారి అందరూ కార్డ్‌పై పేరు రాసి.. పోస్ట్ బాక్స్‌లో వేసేశారు. ఇక రెండో సారి ఆరియానా, సోహెల్‌కు బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇక రీసెంట్‌గా మొహంపై కట్టప్ప అనే స్టాంప్ వేయాలని తెలిపాడు.

మొదటి నుంచి అంతే..
నోయల్ మొదటి నుంచి గ్యాంగ్‌ను లీడ్ చేద్దామనే ప్రయత్నిస్తున్నాడు. తన అభిప్రాయాన్ని చెప్పడమే గాకుండా మిగతా వారిని కూడా ప్రభావితం చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఆరియానా, సోహెల్ చేస్తోంది టాస్క్.. వారి ట్రాప్‌లో పడొద్దు అంటూ టీం కోసమే ఇదంతా చెబుతున్నానని తన అభిప్రాయాన్ని వారిపై రుద్దాడు. అందులో కొందరు మాత్రం నోయల్ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు.

ముద్ర గుద్దడంలోనూ..
కట్టప్పగా ఎవరిని భావిస్తున్నారు? అందుకు గల కారణాలు చెప్పి వారిపై ముద్ర వేయాలని బిగ్‌బాస్ తెలిపాడు. అందరూ తాము భావించే పేర్లను, కారణాలను చెబుతూ ముద్రలు వేశారు. అయితే నోయల్ వంతు వచ్చే సరికి కాస్త అతి చేశాడు. కట్టప్ప అనే ముద్ర వేయడం వల్ల బాధపడతారు.. టీవీల్లో చూస్తున్న పేరెంట్స్ బాధపడతారు.. అందుకే నాకు నేనుగా ముద్ర వేసుకుంటాను అని ఓవర్ డైలాగ్స్ చెప్పాడు.

బిగ్‌బాస్ పంచ్..
అలా ఎవరికి వారు వేసుకోవడం కుదరదు అంటూ నోయల్‌కు బిగ్‌బాస్ పంచ్ వేశాడు. ఇక బిగ్‌బాస్ అలా చెప్పడంతో.. తనకు అమ్మ రాజశేఖర్ మాస్టర్‌తో చనువు ఎక్కువ అని, ఆయనకే వేస్తాను మిగతా వారికి వేస్తే ఫీలవుతారంటూ చెప్పుకొచ్చాడు. ఇక నోయల్ చెప్పిన ఆ మాటల వల్ల నెగెటివిటీ పెరిగిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మాటలు అనకుండా ఉండే.. నోయల్ తిరుగులేకుండా దూసుకుపోయేవాడేమో.


Click it and Unblock the Notifications











