మటన్‌తో అవినాష్‌కు నరకం చూపించిన సోహెల్.. దొర్లుతున్నా కూడా ముక్కలు వదల్లేదు
బిగ్ బాస్ హౌజ్ లో బుధవారం సెంటిమెంట్ తో పాటు సరదా సన్నివేశాలు కూడా చాలానే చోటు చేసుకున్నాయి. గొడవలు ఎన్ని జరిగినా కూడా.. అది కొంతసేపు మాత్రమే అనేలా బిహేవ్ చేస్తున్నారు కొందరు. ఇక మరోవైపు కంటెస్టెంట్స్ సమయానికి తగ్గట్లుగా రంగులు మారుస్తున్నారా లేక గేమ్ లో ఎవరు నిజాయితీగా ఉండడం లేదా అనే అనుమానాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇక మటన్ గోల మరోసారి అవినాష్ ని చాలా ఇబ్బంది పెట్టింది.

అవినాష్ చేసిన పొరపాటు..
గత కొన్ని రోజులుగా అవినాష్ మటన్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు మటన్ తినాలని ఎంతో ఆశగా ఎదురుచూసిన కంటెస్టెంట్స్ ని అవినాష్ నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. రేషన్ మేనేజర్ గా ఉన్న అవినాష్ మటన్ ను డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలని తెలియక నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టడంతో అది పాడవుతుంది.

నాన్ వెజ్ కు దూరమైన అవినాష్
ఇక ముందే ఆ విషయం కొందరికి చెప్పానని అరిచినప్పటికి.. ఆ మాత్రం విషయం కూడా తెలియదా అంటూ అప్పట్లో హౌజ్ మేంట్స్ నవ్వుతూనే ఇబ్బంది పెట్టేశారు. ఇక బిగ్ బాంబ్ కారణంగా అతను బిగ్ బాస్ చెప్పే వరకు నాన్ వెజ్ తినకూడదు. దీంతో బుధవారం ఎపిసోడ్ లో సోహెల్ అతనికి చుక్కలు చూపించాడు. పక్కన కూర్చొని మటన్ తింటూ నోరు ఉరేలా చేశాడు. అవినాష్ ఒక విధంగా తట్టుకోలేకపోయాడు.

మటన్ ని మాత్రం వదిలేది లేదంటూ..
ఇక డ్రిల్ మోగగానే రూల్ ప్రకారం కంటెస్టెంట్స్ పాకుతూ వెళ్ళాలి. ఆ సమయంలో తింటున్న సోహెల్ మటన్ ని మాత్రం వదిలేది లేదంటూ.. పాకుతూనే తిన్నాడు. పక్కనే అవినాష్ కూడా ఉన్నాడు. ఈ నరకం ఏంటి బిగ్ బాస్ అంటూ అవినాష్ చాలా బాధపడ్డాడు. ఇక ఆడియెన్స్ కు ఆ సీన్స్ చాలా నవ్వించాయి. ఇక డ్రిల్ అనంతరం హౌజ్ మెంట్స్ తో రాకతో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యింది.
Recommended Video

బయటకు రాగనే పెళ్లి చేస్తాను: అవినాష్ తల్లి
ప్రతి ఒక్కరు కూడా అమ్మలకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అఖిల్, అభిజిత్ మదర్స్ తరువాత హారిక, అవినాష్ మదర్స్ కూడా వచ్చారు. ఇక అవినాష్ కూడా తల్లిని ముద్దాడుతూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. ఇక పెళ్లి కావాలని అటున్నాడని హౌజ్ మెంట్స్ చెప్పడంతో అవినాష్ తల్లి కూడా ఆప్యాయంగా బయటకు రాగానే చేసేద్దాం అంటూ వివరణ ఇచ్చింది. అరియానాను కూడా అవినాష్ తల్లి ప్రేమగా పలకరించారు.


Click it and Unblock the Notifications











