దిమాక్ ఖరాబ్ చేయక్‌రా బై.. పాత గోడవలతో మళ్ళీ గిల్లుకున్న సోహెల్, అఖిల్

బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం కామన్ అయినప్పటికీ రోజులు గడిచే కొద్దీ వాటిని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా ఇక్కడ నమ్మకంతో ఉండరని అందరికి తెలిసిందే. నమ్మకం పెట్టుకుంటే మాత్రం చివరికి నమ్మిన వాళ్లే ముంచేసే ప్రయత్నం చేస్తారు. ఇక అఖిల్, సోహెల్ ల మధ్య జరిగిన గొడవలను గురువారం ఎపిసోడ్ లో మరోసారి గుర్తు చేసుకొని మరి ఒకరినొకరు గిల్లుకునే ప్రయత్నం చేశారు. అక్కడే వారిద్దరి మధ్య నమ్మకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గొడవలతో పరువుతీసుకుంటున్న స్నేహితులు

గొడవలతో పరువుతీసుకుంటున్న స్నేహితులు

సోహెల్, అఖిల్ మధ్య సరదాగా జరిగిన చర్చ చివరికి ఒకరినొకరు తిట్టుకునే వరకు వెళ్ళింది. తప్పు నిదే అంటే నీదే ఆంటు మాటకు మాట పెంచుతూ ఇద్దరు పరువు తీసుకునేంతలా ప్రవర్తించారు. కొన్ని వారాల క్రితం వరకు చాలా ఓపెన్ గా ఓపిగ్గా మాట్లాడుకున్న ఈ ఇద్దరు ఫైనల్స్ కు వచ్చేసరికి సెంటిమెంట్స్ ను పక్కన పెట్టేస్తున్నారు.

 మొహం మీదే తప్పులు మాట్లాడిన సోహెల్

మొహం మీదే తప్పులు మాట్లాడిన సోహెల్

అఖిల్ నిద్రలో నుంచి లేవగానే సోహెల్ ప్లేట్ పట్టుకొని బెడ్ దగ్గరకు వెళ్లాడు. తింటూనే మొదట సోహెల్ హౌజ్ లో పరిస్థితులను వివరిస్తూ నాతో మాత్రం చాలా తప్పుగా ప్రవర్తించవని కౌంటర్ ఇచ్చాడు. మొన్న మహారాజా టాస్క్ లో ఉన్నప్పుడు నీ ప్రవర్తన చాలా బాధ కలిగించిందని హారికతో ఉన్నప్పుడు గోడవను ముందుకు తీసుకెళ్లకుండా ఉండాల్సింది అంటూ అఖిల్ కు మొహం మీదే చెప్పేశాడు. అలాగే కావాలని సెటైర్స్ వేయడం నాకు కాకుండా వేరే వాళ్ళకు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని సోహెల్ కౌంటర్ ఇచ్చాడు.

ఎదురుదాడికి దిగిన అఖిల్

ఎదురుదాడికి దిగిన అఖిల్

ఇక అఖిల్ కూడా మెల్లగా ఎదురుదాడికి దిగాడు. నేను టాస్క్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు అనుకోకుండా చేయాల్సి వచ్చింది. కానీ నీకు నెగిటివ్ అవ్వాలని చేయలేదు. కొన్ని సరదాగా చేశాను. హారికను కూడా సరదాగా ఇబ్బందుల్లో పెట్టె ప్రయత్నం చేశాను. అంతేగాని నేను ఎలాంటి తప్పు చేయలేదు. ముఖ్యంగా నీ విషయంలో నేను కొంచెం కూడా మిస్టేక్ చేయలేదు అంటూ సోహెల్ కు వివరణ ఇచ్చాడు అఖిల్.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
తలనొప్పి పెంచడానికె వస్తావ్

తలనొప్పి పెంచడానికె వస్తావ్

కానీ అఖిల్ చెప్పిన విషయాలను సోహెల్ పట్టించుకోలేదు. నిదే తప్పు అంటూ పదే పదే పొడిచి చెప్పసాగాడు. దీంతో సహనం కోల్పోయిన అఖిల్ దిమాక్ ఖరాబ్ చేయక్‌రా బై.. తలనొప్పి పెంచడానికె వస్తావ్.. అవసరం లేదు. అలా అనుకుంటే నాతో అసలు మాట్లాడకు. నీ చూపులోనే తప్పు ఉంది అంటూ కౌంటర్ ఇచ్చాడు.. దీంతో సోహెల్ కూడా నీ చూపులోనే తప్పు ఉందని థర్డ్ పర్సన్ గా గొడవలు జరగకుండా చూసుకోవాల్సింది అంటూ మరో కౌంటర్ ఇచ్చి బెడ్ రూమ్ నుంచి వెళ్ళిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X