ఎవరు పైసల్ ఇవ్వకపోతే వారిని బ్యాడ్ చేస్తారా?.. నోయల్‌ను ట్రోలింగ్ చేయడంపై రాహుల్ ఫైర్
బిగ్‌బాస్ షోలో హైలెట్ అవ్వాలంటే కొత్త ప్రమోషన్ కూడా అవసరమే. ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా ఫేమ్ అయిన వారున్నారు. కానీ రెండో సీజన్ నుంచి ఆ పద్దతి పూర్తిగా మారిపోయింది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఓ సరైన పీఆర్ టీంను నియమించుకుని వస్తున్నారు. ఎన్నికల్ల ప్రచారం చేసినట్టుగా హౌస్‌లో వారు తుమ్మినా, దగ్గినా ఏం చేసినా సరే వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి క్రేజ్ వచ్చేలా చేస్తుంటారు.

ఎవరికి వారు ప్రమోషన్స్..
దాదాపు కంటెస్టెంట్లందరికి సపరేట్ పీఆర్ టీం ఉంటుంది. అయితే ఎవరి గురించి వారు తమ తమ మంచిని ప్రమోట్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు. అయితే కొందరు మాత్రం పని గట్టుకుని వేరే వారిపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వ్యవహారాలన్ని రెండో సీజన్‌లొ భారీగా చోటుచేసుకున్నాయి.

నోయల్‌పై ట్రోలింగ్..
నాల్గో సీజన్‌లోని కంటెస్టెంట్లలో అతి బలమైన కంటెస్టెంట్.. ఫ్యాన్ బేస్, క్రేజ్ వైడ్‌గా అందరికంటే ఎంతో ముందున్నాడు. అన్నింటికంటే మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మద్దతు ఉంది. అంతేకాకుండా మూడో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మంది నోయల్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఆ మధ్య నోయల్ అతికి సోషల్ మీడియాలో నెగెటివిటీ పెరిగింది. ట్రోలింగ్ కూడా జరిగింది.

పైసల్ ఇవ్వకపోతే...
అయితే ఇక నిరంతరరాయంగా అదే పనిగా నోయల్‌పై ట్రోలింగ్ జరుగుతుండటం, సోషల్ మీడియాలో ఓ పేజీ రోజూ వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టడంపై రాహుల్ ఫైర్ అయ్యాడు. పైసల్ ఇవ్వకపోతే ట్రోలింగ్ చేస్తారా? అంటూ నిలదీశాడు. మొత్తానికి నోయల్‌కు మాత్రం బయట సపోర్ట్ మాత్రం గట్టిగానే ఉంది.
Recommended Video

కొంచెం మార్చుకుంటే..
నోయల్ ఓవర్ కాన్ఫిడెంట్.. అన్ని ముందే తెలుసుకుని రావడం వల్ల వచ్చిన ఆ కాన్ఫిడెంట్ కాస్త తగ్గించుకుని, అందరినీ కలుపుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ పోతే చివరి వరకు నిలబడగలిగే సత్తా ఉన్నవాడు నోయల్. అన్ని విషయాల్లో తల దూర్చుకుండా తన పని తాను చేసుకుంటే కచ్చితంగా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











