ఆ ఘటనతో మొత్తం మారింది.. అరియానాకు షాక్.. సోహెల్ అలాంటివాడు.. రాహుల్ పోస్ట్ వైరల్
రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతున్న మాటలు, చేస్తోన్న పోస్ట్‌లు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. మొదట్లో నోయల్‌కు సపోర్ట్ చేసిన రాహుల్.. ఆ తరువాత అభిజిత్‌కు మద్దతివ్వడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తరువాత రాహుల్ తన మద్దతును సోహెల్, అరియానాలకు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా కంటెస్టెంట్లకు సపోర్ట్ ఇవ్వడం, తన మద్దతునివ్వడం తప్పేమీ కాదు కానీ రాహుల్ చేసిన పోస్ట్, మాట్లాడిన మాటలు కొంచెం హద్దులు దాటాయి.

పనికిమాలినోళ్లను..
అరియానా, సోహెల్ గురించి రాహుల్ చెబుతూ ఇద్దరూ టాప్ 2లో ఉండాలని వారు పర్ఫామెన్స్ ఇస్తున్నారు.. జెన్యూన్‌గా ఉన్నారు.. అలాంటి వారికే నా సపోర్ట్ ఉంటుందని తెలిపాడు. అక్కడి వరకు ఆగకుండా.. పనికి మాలినోళ్లను బయటకు తోసేయండని చెప్పుకొచ్చాడు.

క్లారిటీతో మరో సారి..
అయితే రాహుల్ పోస్ట్‌లు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఆ తరువాత రాహుల్ తనపై వస్తోన్న ట్రోలింగ్‌పై స్పందించాడు. తాను ఒక కంటెస్టెంట్‌కే సపోర్ట్ చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నానా? అంటూ ఫైర్ అయ్యాడు. అభిజిత్ ఎలాగూ టాప్‌లోనే ఉన్నాడు.. సేవ్ అవుతాడని తెలిసే మిగిలిన వారికి ఓట్లు రావాలన్న ఉద్దేశ్యంతో వారికి సపోర్ట్ చేశానని క్లారిటీ ఇచ్చాడు.

మొత్తం మారింది..
పద్నాలుగో వారంలో అరియానా సోహెల్ మధ్య పెద్ద యుద్దమే జరిగింది. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు.. ఒకరి మీదకు మరొకరు వెళ్లారు. ఎవ్వరూ కూడా తగ్గలేదు. కానీ మొత్తం తప్పు సోహెల్‌దే అన్నట్టు అరియానా చిత్రీకరించేసింది. ఓ అబ్బాయి తన మీదకు రావడం తీసుకోలేకపోతోన్నాను అంటూ అరియానా సింపతీ కొట్టేసింది.

అరియానాను కాకుండా..
ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి రాహుల్ అరియానాకు సపోర్ట్ ఇవ్వడం మానేశాడు.సోహెల్‌కు ఓట్లు వేయండంటూ రాహుల్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇంట్లో అన్ని రకాల ఎమోషన్స్ చూపెట్టి.. ఎంటర్టైన్ చేస్తుంటాడు.. ముక్కుసూటిగా మాట్లాడతాడు.. పాజిటివ్‌గా ఉంటాడు.. మిగతా వాళ్లను కూడా వంద శాతం ఎంకరేజ్ చేస్తూ టాస్కులు బాగా ఆడేలా ప్రోత్సహిస్తుంటాడని చెప్పుకొచ్చాడు.

అదే సమస్య..
స్నేహితుల పట్ల సోహెల్ ఎంతో విధేయుడిగా ఉంటాడు. ఇంట్లో ఎవ్వరు హర్ట్ అయినా కూడా చూడలేడు సమస్యలు కనుక్కొని పరిష్కరిస్తుంటాడు. అతనికి షార్ట్ టెంపర్ ఉంది కానీ అదేమీ అంత పెద్ద సమస్య కాలేదు..అది అతనిలోని సమస్యే.. దాన్ని ఎప్పుడూ కూడా కప్పి పుచ్చుకోవాలని చూడలేదు.. ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకునేందుకు ముందడుగు వేస్తుంటాడు.. ఎంతో నిష్ఫక్షపాతంగా ఉంటాడు.. మనందరిలో ఒకడిలా ఉంటాడని సోహెల్ గురించి రాహుల్ వివరించాడు.


Click it and Unblock the Notifications











