టాప్ 2పై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్ సంచలనం.. దాని వెనుక అంత కథ ఉందా?
బిగ్ బాస్ మూడో సీజన్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్‌కు ఓ ఇమేజ్ ఉంది. అయితే మామూలుగానే రెండో సీజన్ విజేతగా కౌశల్ నిలిచినప్పుడు కొంత వ్యతిరేకత ఎదురైంది. కౌశల్ కంటే గీతా మాధురి విన్నర్ అవ్వాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇక మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ కంటే శ్రీముఖి విన్నర్ కావాల్సిందని గుసగుసలు వినిపించాయి.
ఎందుకంటే టాస్క్‌లో పర్ఫామెన్స్, ఎంటర్టైన్మెంట్ చేసే విధానంలో శ్రీముఖి ముందంజలోనే ఉంది. కానీ ఓట్లు మాత్రం రాహుల్‌కే ఎక్కువ వచ్చాయి. ఇలా ప్రతీ సారి విజేత విషయంలో అందరూ సంతృప్తి చెందుతూనే ఉన్నారు. ఈ సారి కూడా అలాంటి ఓ పరిస్థితే ఏర్పడేలా కనిపిస్తోంది.

మారుతున్న సమీకరణాలు..
షో ముగిసేందుకు వస్తున్న కొద్దీ సమీకరణాలు మారుతున్నాయి. అఖిల్ కోసం స్టార్ కమెడియన్స్, యాక్టర్స్ రంగంలోకి దిగుతున్నారు. సోహెల్ కోసం హీరోలు దిగారు. అభిజిత్ కోసం మెగా సపోర్ట్ వచ్చేసింది. ఇలా కంటెస్టెంట్లందరికీ ఎవరో ఒకరు మద్దతు తెలుపుతూనే ఉన్నారు.

మాట మార్చిన రాహుల్..
అయితే ఇలా సపోర్ట్ ఇవ్వడం, మద్దతు తెలపడం కొత్తేమీ కాదు. కానీ ఒకరికి సపోర్ట్ తెలుపుతూ.. మిగతా కంటెస్టెంట్లను తక్కువ చేయడం మాత్రం తప్పే. రాహుల్ సిప్లిగంజ్ చేసింది కూడా అదే. తన దృష్టిలో టాప్ 2లో సోహెల్, అరియానా ఉంటారని చెప్పుకొచ్చాడు. అక్కడి వరకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పనికి మాలినోళ్లను తోసేయండని కామెంట్లు చేయడంతో వ్యవహారం మారిపోయింది.

నెటిజన్లు ఫైర్..
అయితే పర్ఫామెన్స్ జెన్యూనిటీని బట్టి తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చని రాహుల్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. నువ్ మూడో సీజన్‌లో ఏం చేశావ్? అసలు నువ్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది.. పునర్నవితో పులిహోర కలపడం తప్ప నువ్వేం చేశావ్ అని నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

నోయల్‌తో గొడవలు..
బిగ్ బాస్ షోలో మొదటి నుంచి రాహుల్ తన సపోర్ట్‌ను నోయల్‌కే ఇస్తూ వచ్చాడు. నోయల్ బయటకు వచ్చాక అతనికి ఇష్టమైన అభిజిత్ హారికలకు రాహుల్ మద్దతు తెలిపాడు. కానీ తాజాగా మాత్రం రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇందుకు కారణంతో రాహుల్ నోయల్ మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడమేనట.
Recommended Video

అన్ ఫ్రెండ్, నో విషెస్..
నోయల్ రాహుల్ మధ్య గొడవలు జరిగాయి.. అందుకే అలా మాట మార్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నోయల్ బర్త్ డేకు రాహుల్ విషెస్ చెప్పలేదని, పైగా నోయల్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో రాహుల్ అన్ ఫ్రెండ్ చేసేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అందుకే ఇలా పోస్ట్ చేశాడని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











