Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్ ట్విస్ట్.. నోయల్ జైలుకి.. రోబో టీమ్ విజయం సాధించిందా!
బిగ్‌బాస్ మూడో వారంలో ఎన్నో మిరాకిల్స్ జరగబోతోన్నాయి. ఇప్పటి వరకు కలిసి ఉండి ప్రేమగా మాట్లాడుకున్న కంటెస్టెంట్ల మధ్య దూరం పెంచేశాడు బిగ్‌బాస్. నామినేషన్ ప్రక్రియ అంటూ పెద్ద చిచ్చే పెట్టాడు. ఇక ఉక్కు హృదయం అంటూ టాస్క్ ఇచ్చి మరో బాంబ్ వేశాడు. ఇక మొదటి సారిగా ఓ కంటెస్టెంట్‌ను జైల్లో వేయబోతోన్నాడట. అంతేకాకుండా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతోందట. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.
ఉక్కు హృదయం టాస్క్..
ఉక్కు హృదయం అనే ఈ టాస్క్‌లో రోబోల టీంలో అభిజీత్, కుమార్ సాయి, ఆరియానా, హారిక, దేవీ నాగవల్లి, గంగవ్వ, అవినాష్‌లు ఉన్నారు. మిగతా వారంతా మనుషుల టీం. సిల్వర్ బంతిని పగలగొడితే ఒక రోబో చనిపోతుంది.. చివరి వరకు ఒక్క రోబో అయినా మిగిలినా రోబో టీం గెలిచినట్టే. గెలిచిన వారిలోనే కెప్టెన్ అవుతారని తెలిపాడు.
టాస్క్‌లో రచ్చ రచ్చ..
ఇక ఇలా ఈ టాస్క్‌లో గార్డెన్ ఏరియా, రోబోలకు కావాల్సిన చార్జింగ్ మనుషుల టీం గుప్పిట్లో ఉండగా.. మనుషులకు అవసరమైనవన్నీ రోబోల అధీనంలో ఉంటాయి. ఒకరొకరు ఇచ్చిపుచ్చుకోవాల్సింది పోయి..మొండి పట్టుకు దిగారు. సిగరేట్ ఇవ్వక రోబో టీం మొండి పట్టుపడితే.. చార్జింగ్ ఇవ్వమంటూ మనుషులు టీం భీష్మించుకుని కూర్చుంది
అభిజీత్ మాస్టర్ ప్లాన్..
ఇక అభిజీత్ కండబలాన్ని ఉపయోగించలేదు గానీ బుద్దిబలాన్ని ఉపయోగించాడు. ఫిజికల్‌గా రోబో టీంకు ఎలాంటి సాయం చేయలేదు. గానీ చార్జింగ్ ఎలా సంపాదించాలన్న ఐడియా ఇచ్చాడు. మనుషుల టీం సభ్యురాలైన దివిని కిడ్నాప్ చేశారు.. అందరూ కలిసి చార్జింగ్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది.
రోబో టీం విజయం..
ఇక అభిజీత్ వేసిన మాస్టర్ ప్లాన్ బాగానే వర్కౌట్ అయినట్టు తెలుస్తోంది. ఈ టాస్క్‌లో రోబోల టీం గెలుపొందినట్టు లీకులు బయటకు వచ్చాయి. ఇక అంతేకాకుండా నోయల్ జైలుకు వెళ్లినట్టు కూడా సమాచారం అందుతోంది. టాస్క్‌లో ఏదైనా తప్పు చేసి ఉంటాడో లేదా కెమెరాకు పిల్లో అడ్డుపెట్టడం వల్లే జైల్లే వేశారో చూడాలి.
Recommended Video
మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
ఇక మూడో వారంలో మరో ట్విస్ట్ అంటే ఇదే. మూడో వారంలో మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. జంప్ జిలానీ ఫేం స్వాతీ దీక్షిత్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నట్టు తెలుస్తోంది. ఇక మరి ఈమెను ఇంటి సభ్యులు ఆహ్వానించి ఆదరిస్తారో లేదో చూడాలి.