ప్రోమోతో సస్పెన్స్.. వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతోన్న ఆ ఒక్కరు ఎవరంటే?.. మిగతా ఆ ఇద్దరి కథ ఏంటి!

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు సంబంధించి నేటి ఎపిసోడ్‌లో రెండు ఘట్టాలు జరగబోతోన్నాయి. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్, అలాగే ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇవి రెండు ఒకేసారి చేయడంతో మళ్లీ పదహారు మంది కంటెస్టెంట్లతో హౌస్ అంతా నిండుగానే ఉండబోతోంది. అయితే ఆదివారం ఎపిసోడ్‌ను గ్రాండ్‌గానే ప్లాన్ చేసినట్టు కనిస్తోంది. ఆటపాటలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.

ప్రోమోలతో రచ్చ..

ప్రోమోలతో రచ్చ..

నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన రిలీజ్ చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నాయి. దివి డ్యాన్సులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. దేవీ నాగవల్లి ఊర మాస్ స్టెప్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరి పర్ఫామెన్స్ కోసమైనా సరే ఎపిసోడ్ చూడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా మరో ప్రోమో..

తాజాగా మరో ప్రోమో..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఎన్నో క్లూలను వదిలాడు నాగ్. ఓ వైల్డ్ కార్డ్ఎంట్రీ ఉండోబోతోందని తెలిపాడు. ఇక అంతేకాకుండా ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్‌కు ఓ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏ ఏ జంతువులు ఏ ఏ హౌస్ మేట్స్‌కు సెట్ అవుతాయో చెప్పమన్నట్టున్నాడు. అందులో భాగంగా లాస్య గాడిద, మెహబూబ్ గద్ద, దేవీ మొసలి, కళ్యాణి కోతి, నోయల్ నక్క, అఖిల్ బర్రె అని జత చేసినట్టు కనిపిస్తోంది.

కమెడియన్ ఎంట్రీ..

కమెడియన్ ఎంట్రీ..

కమెడియన్ సాయి కుమార్ (ఈరోజుల్లో ఫేం) ఈరోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోతో అది స్పష్టమవుతోంది. ఇక ఈ కమెడియన్ ఎంట్రీతో అయినా ఆటలో ఆసక్తి వస్తుందో లేదో చూడాలి. ఇతను వచ్చి ఎంటర్మైన్మెంట్ చేస్తాడా. లేదా తనలోని సీరియస్ యాంగిల్‌ను బయటకు తీస్తాడా? అన్నది చూడాలి.

మిగిలిన ఆ ఇద్దరు..

మిగిలిన ఆ ఇద్దరు..

మామూలుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ముగ్గుర్ని ఫిక్స్ చేశారట. అందులో ఒకరిని ఈ రోజు లోపలకి పంపిస్తున్నారు. మిగిలిన ఇద్దరిలో జబర్దస్త్ అవినాష్‌ను రెండో వారాంతంలో ప్రవేశపెట్టబోతోన్నారని టాక్. లేదా వారం మధ్యలో ఎప్పుడైనా అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు. ఇక హీరోయిన్ స్వాతి దీక్షిత్ (అల్లరి నరేష్ జంప్ జిలానీ) పరిస్థితి కూడా అంతే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X