బిగ్ బాస్4: రాగానే సమంత ఫోకస్ కూడా అతనిపైనే.. మాటలతోనే పడేశాడు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని దసరా రోజు బిగ్ బాస్ హోస్ట్ గా సరికొత్తగా ఆకట్టుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక బుల్లితెరపై హోస్ట్ గా కనిపించి తనవంతు న్యాయం చేసింది. మామ నాగార్జున షూటింగ్ వలన బిగ్ బాస్ కి బ్రేక్ ఇవ్వడం వలన హోస్ట్ బాధ్యతలను చాలా ఈజీగా తన భుజాలపై వేసుకుంది. అయితే సమంత ఎక్కువగా తన మాటలతో కంటెస్టెంట్స్ కి చాలా బాగా దగ్గరైంది.

 బాయ్స్ మీరంతా ఎవరు?

బాయ్స్ మీరంతా ఎవరు?

ముందుగా ఆడవాళ్లతో మాట్లాడిన సమంత స్త్రీ శక్తి గురించి చాల గొప్పగా చెప్పింది. అబ్బాయిలను పట్టించుకోకుండా ఆడవాళ్ల గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. ఏదేమైనా ఈ రోజు మాత్రం ఆడవాళ్ళదే అంటూ అందుకు ప్రతి ఇంట్లోని ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పింది. ఇక హౌజ్ లో అబ్బాయిలను మీరంతా ఎవరు అంటూ ఒక విధంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

సమంత కూడా అతనివైపే

సమంత కూడా అతనివైపే

సమంత సరదాగా అన్న మాటలకు హౌజ్ మేంట్స్ అంతా నవ్వేశారు. మా గురించి కూడా మాట్లాడాల్సిందే అంటూ చెప్పడంతో సరే మీ గురించి మీరే రెండు మాటల్లో చెప్పండని సమంత వివరణ ఇచ్చింది. ఆ తరువాత అందరూ మాట్లాడారు. అయితే సమంత షో స్టార్ట్ చేయగానే మొదటి చూపు అభిజిత్ పైనే పడింది. అందరికి హాయ్ చెబుతూనే అభి కొత్త డ్రెస్సా అంటూ నవ్వేసింది.

సమంత మాటలకు ఉప్పొంగిపోయిన అభి

సమంత మాటలకు ఉప్పొంగిపోయిన అభి

నీకు ఎంత మంది అమ్మాయిలు ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అంటూ సమంత మాట్లాడిన విధానానికి అభిజిత్ లో సంతోషం ఆగలేదు. అభిజిత్ కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా సమంతను కూడా తన మాటలతో ఎట్రాక్ట్ చేశాడు. ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటున్న క్రమంలో అభిజిత్ ముందుగా సమంతది బెస్ట్ స్మైల్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

ఎంతమంది కావలయ్యా?

ఎంతమంది కావలయ్యా?

అభిజిత్ మాటలకు నవ్వేసిన సమంత హౌజ్ లోనే కాకుండా బయట జనాలను కూడా నీ మాటలతో ఆకట్టుకుంటున్నావ్.. ఇప్పుడు నన్ను కూడానా అంటూ.. సమంత సమాధానం ఇచ్చింది. ఇక ఎంతమంది కావలయ్య అంటూ మరో సెటైర్ కూడా వేసింది. అయితే అభిజిత్ మాత్రం చాలా కూల్ గా సమంత అడిగిన వాటికి సమాధానం ఇచ్చాడు.

 అదే నా బలం.. వీక్ నెస్ కూడా ఉంది

అదే నా బలం.. వీక్ నెస్ కూడా ఉంది


ఇక తనలోని మైనస్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడిన అభిజిత్.. ముందుగా క్రమశిక్షణ, ఓపిక నా బలం అంటూ కొంచెం కోపం కూడా ఉందని అదే వీక్ నెస్ అని చెప్పాడు. కొంతమందితో నువ్వు మాట్లాడలేదు కదా అంటూ సమంత చెప్పగా.. అవును అప్పుడు నేను ఉన్న పరిస్థితులలో ఆరు వారాలు ట్రావెల్ అయ్యాం కాబట్టి అదే బెస్ట్ అనిపించిందని సమాధానం ఇచ్చాడు అభిజిత్. ఇక అభి అలా ఆన్సార్ ఇవ్వగానే అఖిల్, మోనాల్ మొహంలో ఎదో డిఫరెంట్ ఫీలింగ్ కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X