Don't Miss!
- News సీఎం జగన్ ను హతమార్చేందుకే గులకరాయితో దాడి.. షాకింగ్ రిమాండ్ రిపోర్ట్!!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అభిజిత్‌పై ఫోకస్ పెట్టిన సమంత.. బిగ్‌బాస్ టైటిల్ గెలిచినా గెలవకపోయినా అతనితోనే ఆ ప్లాన్
బిగ్‌బాస్ షో ద్వారా అభిజిత్ అయితే కెరీర్ కు సరిపోయేంత క్రేజ్ అందుకున్నాడు. ఈ సరికొత్త గుర్తింపుతో కెరీర్ లో అనుకున్న స్థాయిలో హీరోగా ఎదగాలని ప్లాన్ చేసుకోబోతున్నారు అభి. టైటిల్ విన్నర్ అయినా కాకపోయినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే గట్టిగానే పెరిగింది. అందరి కంటే ఎక్కువగా ఓట్లు సంపాదించిన కంటెస్టెంట్ గా కూడా అతనే రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు.
అభిజిత్ కోసం సెలబ్రెటీలు
అభిజిత్ క్రేజ్ గురించి సెలబ్రెటీలు సైతం వారి మద్దతు అందిస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నటీనటులలో విజయ్ దేవరకొండ అలాగే సుధాకర్ కూడా అభిజిత్ కు మద్దతు అంధించారు. సుధాకర్ అయితే అభిజిత్ కోసం అమెరికా నుంచి వచ్చేశాడు. అతని కోసం వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ప్రచారాలు కూడా చేశాడు.
సమంత కూడా ఫిదా..
ఇక అభిజిత్ క్రేజ్ గురించి తెలుసుకున్న సమంత కూడా ఆశ్చర్యపోయింది. దసరా సందర్భంగా సమంత షోకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజే సమంత అభిజిత్ గురించి స్పెషల్ గా మాట్లాడింది. నీకు లేడి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారని అద్భుతంగా గేమ్ అడుతున్నావ్ అంటూ పొగడ్తలతో ముచ్చెత్తింది.
సమంత షోలో అభిజిత్
ఇక ప్రస్తుతం ఒక రూమర్ అయితే వైరల్ గా మారింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిజిత్ సామ్ జామ్ షోలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆహా యాప్ లో సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆ టాక్ షోలో అగ్ర తారలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ప్రత్యేక అతిధులుగా వచ్చారు.
అతనైతేనే కరెక్ట్
ఇక త్వరలో అభిజిత్ కూడా సమంతతో ముచ్చటించనున్నాడట. అసలైతే బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే వారిని గెస్ట్ గా రప్పించాలని అనుకున్నారట. కానీ సమంత ఫోకస్ మొత్తం అభిజిత్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. అభిజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని అతనైతే షోకు మంచి హైప్ క్రియేట్ అవుతుందని సమంత నిర్వాహకులకు చెప్పిందట. త్వరలోనే వరుస ఇంటర్వ్యూలతో అభి బిజీ కానున్నట్లు సమాచారం.