మరోసారి డౌన్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు.. దారుణమైన రేటింగ్స్
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు స్టార్ట్ అవుతోంది అనగానే ఓ వర్గం ఆడియెన్స్ లో ఎంతో జోష్ కనిపించిందని సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ని బట్టి అర్ధమయ్యింది. నాగార్జున మరోసారి సరైన పద్ధతిలోనే స్టార్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారో అప్పుడే షోపై బజ్ పోయింది. గతంలో మాదిరిగా అయితే కంటెస్టెంట్స్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడం లేదు. ఇక ఇప్పుడు రేటింగ్స్ లో స్టార్ మా నిర్వాహకులకు ఊహించని షాక్ తగులుతోంది.

ముప్పుతిప్పలు పెట్టినా
గత ఎపిసోడ్స్ లతో పోలిస్తే ప్రస్తుతం వస్తున్న రేటింగ్స్ ఇంకా తగ్గాయని తెలుస్తోంది. మిగతా భాషల్లో ఎదో కాంట్రవర్సీతో షోకి మంచి హైప్ అయితే క్రియేట్ అవుతోంది. కానీ తెలుగులో మాత్రం అంతగా హైప్ క్రియేట్ కావడం లేదు. బిగ్ బాస్ టాస్కులతో ముప్పు తిప్పలు పెడుతున్నా కూడా ఆడియెన్స్ ఎట్రాక్ట్ కావడం లేదు.

దారుణమైన రేటింగ్స్
7వ వారం వీకెండ్ TRP 5.2 మాత్రమే వచ్చింది. ఇక సమంత ఆదివారం సందడి చేసినప్పటికీ 7.2 మాత్రమే వచ్చింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ వస్తే 10కి పైగా రావచ్చాని అనుకున్నారట. కానీ ఆ రోజు పండగ వేళ జనాలు టీవీల వైపుకు చూడలేదు. ఆ తరువాత డిజిటల్ ద్వారా హాట్ స్టార్ లో చూసిన వారు చాలా మంది ఉన్నారు. ఏదేమైనా రేటింగ్ ఇలానే కొనసాగితే కష్టమే అనే కామెంట్స్ వస్తున్నాయి.

దెబ్బ కొట్టిన ఎలిమినేషన్స్
వీక్ డేస్ లో యవరేజ్ రేటింగ్ 4.6 TRP అని తెలుస్తోంది. హోటల్ టాస్క్ లు, అలాగే అంతకుముందు గంగవ్వ ఉన్నప్పుడు ఒక టాస్క్ కి 8కి పైగానే రేటింగ్ వచ్చేవని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మాత్రం అందులో సగం రావడానికే కొట్టుమిట్టాడుతోంది. పైగా ఎలిమినేషన్స్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ రేటింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video

నాగార్జున రంగంలోకి దిగాల్సిందే
మరి నాగార్జున ఈ ఆదివారం ఎంతవరకు హైప్ క్రియేట్ చేస్తాడో చూడాలి. నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ షూటింగ్. కోసమని మూడు వారాల పాటు అక్కడే ఉండాలని అనుకున్నాడు. కానీ రేటింగ్స్ తగ్గడంతో బిగ్ బాస్ కి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం తప్పక రావాలి. ఇక సమంత మళ్ళీ హోస్ట్ గా రాదని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయాలపై ఒక క్లారిటీ రావాలి అంటే శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











