బిగ్ బాస్ 4 లేటెస్ట్ అప్డేట్.. ఇప్పుడు మొదలుపెట్టి ఆ తరువాత చూపిస్తారట!
ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలనే ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తోంది. ఎక్కడికక్కడ షూటింగ్స్ ఆగిపోవడంతో చాలా మంది సినీ వర్కర్స్ జీవితాలపై ప్రభావం చూపుతోంది. ఇక లాక్ డౌన్ అనంతరం జూన్ నుంచి షూటింగ్స్ జరుపుకోవచ్చని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో బిగ్ బాస్ 4 తెలుగు కూడా మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

కరోనా ఎఫెక్ట్..
కరోనా వైరస్ కారణంగా మొదలైన లాక్ డౌన్ వల్ల ఎన్నో షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి. రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడగా.. రాబోయే సినిమాలు మరింత ఆలస్యం కానున్నాయి. టీవీ, సినిమాలపై ఆధారపడిన వారిపై చాలా కరోనా చాలా ఎఫెక్ట్ చూపించింది. సెట్ చేసుకున్న షెడ్యూల్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కొందరు నిర్మాతలు ఆర్థికంగా దెబ్బతిన్నారు.

జూన్ నుంచి మొదలు..
ఫైనల్ గా తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కి సంబంధించిన విషయంలో ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్స్ ని కొన్ని జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని వీలైనంత వరకు ఎక్కువ జనసాంద్రత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సినీ ప్రముఖులు ఈ విషయంపై ఆనందిస్తూ షూటింగ్స్ కోసం సిద్ధమవుతున్నారు.

బిగ్ బాస్ 4..
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 4 ఇప్పటికే మొదలు కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు. ఇక ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బిగ్ బాస్ పనులు మొదలు పెట్టాలని స్టార్ మా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జరిగిన మూడు సీజన్లకు సంబంధించిన ఎపిసోడ్స్ ని ప్రస్తుతం టెలికాస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే కాక టీజర్ తో గేట్ రెడీ అని ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట.

ఎప్పుడంటే..
జూన్ నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చని ఆదేశాలు రావడంతో బిగ్ బాస్ 4 బ్యాక్ గ్రౌండ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ విషయంలో ఒక నిర్ణయనికి వచ్చినట్లు టాక్. ఇక జూలై 25 నుంచి షోను స్టార్ట్ చేసి అక్టోబర్ లో టెలికాస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఒకే హౌజ్ లో అంత మంది కంటెస్టెంట్ ని ఇలాంటి సమయంలో చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది పలువురిలో మెదులుతున్న ప్రశ్న.


Click it and Unblock the Notifications











