Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
బిగ్బాస్లో ఆ తప్పు చేసి బుక్కవ్వకండి.. కెరీర్ నాశనమే.. అనుభవంతో చెబుతున్నా: గీతామాధురి
బిగ్ బాస్ హౌజ్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ మాజీ కంటెస్టెంట్స్ తో కలిస్తే ఆ కిక్కు ఎలాక్ ఉంటుందో రుచి చూపించారు. 100వ రోజు ప్రత్యేకంగా గత సీజన్స్ లలో బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇచ్చిన కొందరు సెలబ్రేటీలను ప్రస్తుతం హౌజ్ లో ఉన్నవారితో విర్చువల్ గా కనెక్ట్ చేసిన బిగ్ బాస్ మంచి ఫన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. మాజీ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వారి అనుభవాలను కూడా వివరించారు. ఇక గీతామాధురి కూడా తన అనుభవాలను చెబుతూ ఎం చేసినా కూడా బిగ్ బాస్ లో ఒక తప్పు మాత్రం చేయవద్దని అలా చేస్తే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా ప్రభావం ఉంటుందని అన్నారు.
అందరిచూపు అభిపైనే ఉంది..
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా వరకు పోటాపోటీగా కొనసాగుతున్నారు. ఈ సారి టాప్ 5లో ఉన్న అఖిల్ , అభిజిత్, సోహెల్, హారిక, అరియానాలలో ఎవరు గెలుస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఎక్కువగా అందరి చూపు అభిపైనే ఉంది. ఇప్పటికే అతనికి బయట సెలబ్రెటీల నుంచి కూడా భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది.
మాజీ కంటెస్టెంట్స్ రచ్చ..
ఇక వందవ రోజుకు చేరుకున్న బిగ్ బాస్ లో కొంచెం స్పెషల్ గా ఉండాలని మాజీ కంటెస్టెంట్స్ ను పిలిపించారు. విర్చువల్ గా కనెక్ట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సీజన్ 1 ఫైనలిస్ట్ హరితేజ, సీజన్ 2 రన్నరప్ గీతామాధురి, సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి అలాగే మూడవ సీజన్ కంటెస్టెంట్ అలీ రేజా.. స్పెషల్ గెస్టులుగా సీజన్ 4 కంటెస్టెంట్ తో మాట్లాడారు.
గీతామధురి అనుభవాలు
మాజీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు వారి అనుభవాల్ని తెలుపుతూ గోల గోల చేశారు. ఇక మేమున్న రోజుల్లో అలా ఉండేది కాదని, కనీసం మంచి సౌకర్యాలు కూడా ఉండేవి కావని మాజీ కంటెస్టెంట్స్ పంచ్ లు వేశారు. ఇక గీతా మధురి మాత్రం ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా వివరించారు. ఏం చేసినా కూడా ఆలోచించి మాట్లాడాలని హితబోధ చేసింది.
అఖిల్ పులిహోరపై పంచ్
అఖిల్ పులిహోర పై కూడా గీతామధురి పంచ్ లు వేసింది. ఒక్కొక్కరి గురించి తనదైన శైలిలో మాట్లాడిన ఆమె.. అఖిల్ కు మాత్రం అలాంటి రిలేషన్స్ చాలానే ఉన్నాయని తోటి సభ్యులతో కలిసి అనుమానాలు రేకెత్తించింది. మోనాల్ చేతి మీద ఏదో రాయడం ఆ తరువాత మిగతా అమ్మాయిలతో కూడా పులిహోర గట్టిగానే కలిపాడని ఏడిపించింది.
Recommended Video
అలాంటి తప్పలు మాత్రం చేయకండి
ఇంకా గీతామాధురి ఏం చెప్పిందంటే.. ఫైనల్స్ కు వచ్చారు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనసులో ఒక రకమైన కసి ఉంటుంది. అయితే మాట్లాడే ప్రతి మాట ఇక్కడ చాలా ముఖ్యం. మనం మాట వల్ల కేవలం ఇక్కడ మాత్రమే కాదు బయట కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఒకరి కెరీర్ ని డిస్టర్బ్ చేసేలా కూడా మాట్లాడకూడదు. మన ఆలోచనల తీరు చాలా ప్రభావం చూపవచ్చు. అనుభవంతో చెబుతున్నా అలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకండి. అంటూ గీతా మాధురి వివరణ ఇచ్చింది.