మనం సేఫ్.. మరోసారి మెహబూబ్, సోహైల్ సీక్రెట్ టాక్!
బిగ్ బాస్ 4 మొదలైనప్పటి నుంచి కూడా హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య ఫ్రెండ్షిప్ ఎంత ఉన్నా కూడా టాస్కులు విషయానికి వచ్చేసరికి ఒకరికొకరు విలన్స్ లా మారుతున్నారు. అయితే ఎక్కువగా మెహబూబ్, సోహైల్ మాత్రం పరిస్థితులు ఎలా ఉన్నా కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనేలా ఉన్నారు. ఇలా కనిపిస్తే బిగ్ బాస్ స్పెషల్ ప్లానింగ్ తో చిచ్చు పెట్టడానికి రెడీగా ఉంటాడని చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. గత ఎపిసోడ్స్ లలో అది కొంత వరకు నిజమయ్యింది.
ఇక సీక్రెట్ గా మీటింగ్ పెట్టాలి అంటే మెహబూబ్, సోహైల్ తరువాతే ఎవరైనా. అయితే అఖిల్ ఈ మధ్య వీరికి దూరంగానే ఉంటున్నాడు. ఇక గతవారం ముగ్గురు ఒకేసారి సేవ్ అవ్వగా ఇప్పుడు కూడా అదే ఆలోచన వస్తున్నట్లు మెహబూబ్ సోహైల్ కు వివరణ ఇచ్చాడు. బుధవారం ఎపిసోడ్ లో ఒకవేపు బిగ్ బాస్ నెక్స్ట్ ఇచ్చే ట్విస్ట్ ఏమిటనే విషయం గురించి అందరు ఆలోచిస్తుంటే మెహబూబ్ మాత్రం మనం సేఫ్ రా.. అంటూ తీరిగ్గా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఏమిటో గాని వీరు ప్రతిసారి సేఫ్ అనుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఎప్పటిలానే ఈ సారి కూడా సేవ్ అవుతారనే అనుమానం కూడా వస్తోంది. ఎందుకంటే హౌజ్ లో అందరి ఫోకస్ ఇప్పుడు అరియానాపైనే ఉంది. కెప్టెన్ గా హడావుడి చేయడంతో అందరూ రివెంజ్ ప్లాన్ చేసినట్లు అర్ధమయ్యింది. ఇక ఆడియెన్స్ నుంచి ఏమైనా మద్దతు లభిస్తుందో లేదో చూడాలి. అఖిల్ పై కూడా ఫోకస్ పడినట్లు అర్ధమయ్యింది గాని మోనాల్ అఖిల్ ని బిగ్ బాస్ అంత ఈజీగా బయటకు పంపడనే టాక్ కూడా ఎక్కువవుతోంది.


Click it and Unblock the Notifications











