ఏందే, ఒరేయ్ అంటూ రచ్చ.. సీక్రెట్ రూంలో సోహెల్, ఆరియానా సందడి
బిగ్‌బాస్ ఆడించే ఆట ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం. ప్రతీదానికి ఓ లెక్క ఉంటుంది. మొదటి రోజు కనెక్షన్ గేమ్ అంటూ జంటలను చేసిన బిగ్‌బాస్ అందులో ఒకరిని నామినేషన్‌లో పెట్టేసేలా చేశాడు. ఇక ప్రస్తుతం ఇంట్లో తాము పద్నాలుగు మంది మాత్రమే ఉన్నామని భ్రమ పడుతున్నారు కొంతమంది. కానీ ఇంట్లోకి సభ్యులను పంపించక ముందే ప్లాన్ వేసి పెట్టాడు బిగ్‌బాస్. తొమ్మిది, పదో కంటెస్టెంట్లు (సోహెల్, ఆరియానా)లను సీక్రెట్ రూంలో పెట్టేశాడు.

అందుకే అలా..
మొదట్లోనే ఇద్దరిని సీక్రెట్ రూంలోకి పంపిచడం వెనుక పెద్ద ప్లానే ఉంది. వీరిద్దరి సీక్రెట్ రూంలో ఉంచడం వల్ల.. మిగతా హౌస్‌మేట్స్ అసలు స్వరూపాలేంటో తెలుసుకునే వీలు ఉంటుంది. మళ్లీ వీరిద్దరి సీక్రెట్ రూం నుంచి ఇంటి సభ్యుల మధ్యలో వదిలితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఫీలింగే కలుగుతుంది మిగతా వాళ్లకి. అప్పుడు ఒకరంటే ఒకరికి పడకపోవడం, గొడవలు జరగడం, వారి విషయాలను వీరికి చెప్పడం, వీరి విషయాలను వారికి చెప్పడం అబ్బో పెద్ద కథే జరుగుతంది.

ఇట్టే కలిసిపోయారు..
స్టేజ్ మీద సోహెల్ కళ్లను చూసి అమాయకుడు, పద్దతిగలవాడు అంటూ ఆరియానా అంచనా వేసింది. అలా రూంలోకి వెళ్లిందో లేదో బద్మాష్ అంటూ తేల్చేసింది. అవతల పాపం సోహెల్ మాత్రం.. ఒరేయ్ రా అని అంటోందని నాగ్‌తో విన్నవించుకున్నా పట్టించుకోలేదు. మొత్తానికి ఇద్దరూ బాగానే కలిసిపోయారు.

సోహెల్ పైకి ఎక్కి మరి..
ఇక ఉదయాన్నే వ్యాయమం చేసిన సోహెల్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆరియానాను తన వీపు మీద ఎక్కించుకుని పుష్ అప్స్ చేసేశాడు. ఆడియెన్స్ ఏమైనా అనుకుంటారాని అరియానా అంటే.. అంత లేదులే అని తేలిగ్గా తీసిపారేశాడు. మొత్తానికి ఒక్క రాత్రిలోనే వీరు బాగా దగ్గరయ్యారు.
Recommended Video

ఏందే, ఒరేయ్ వరకు వచ్చేసింది..
ఇంటి సభ్యులకు ఫోన్ చేసిన ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలోనూ వీరిద్దరి కాంబినేషన్, డైలాగ్స్, ఆ చనువు బాగానే వర్కౌట్ అయింది. మొత్తానికి ఇలా ఈ ఇద్దరు మాత్రం ఏందే, ఒరేయ్ అంటూ బాగానే క్లోజ్ అయ్యారు. కొంపదీసి వీరిద్దరి మధ్య రహస్య బంధం ఏర్పడే వరకు ఇలానే ఓ రూంలో ఉంచేస్తాడేమో పాడు. ఇప్పుడైతే ఆ నైబర్ రూంలో ఇద్దరూ బాగానే సందడి చేసేస్తున్నారు. ఇక బయటకు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో మరి.


Click it and Unblock the Notifications











