Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆ ఒక్క మాటతో ఫేమస్ అయ్యాడు.. సోషల్ మీడియాలో సోహెల్ సోదరుడు వైరల్
బిగ్ బాస్ షోలో శనివారం నాటి ఎపిసోడ్లో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. నాగార్జున ఇచ్చిన పంచ్‌లో ఓ లెవెల్లో ఉంటే తమ ఇంటి సభ్యులే అభిజిత్‌ను పొగడటంతో అభిజిత్, అఖిల్‌కు మింగుడుపడనట్టు కనిపిస్తోంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ మొత్తంలో అభిజత్,సోహెల్, అరియానా స్టార్స్ అయ్యారు. ఇక కొందరు అభిజిత్‌ను పొగిడిన తీరును చూసైనా బయట ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకుంటారేమో చూడాలి.
అలాంటి టాస్క్..
పదకొండో వారంలో ఫ్యామిలీ మెంబర్స్ రప్పించడంతో ఎమోషన్స్‌ను పండించాడు. అయితే శనివారం నాటి ఎపిసోడ్‌లోనూ అదే జరిగింది. కంటెస్టెంట్లకు తమ ఇంటి సభ్యులను చూసి, మాట్లాడుకునే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అంతకముందు ఓ టాస్క చేయాలని, తాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాల్సిఉంటుందని, అప్పుడు ఫ్యామిలీని కలుసుకునే ఛాన్స్ ఇస్తానని నాగార్జున చెప్పాడు.
ఆ ముగ్గురు అభిజిత్‌నే..
ఎవరితో మాట్లాడకుండా ఉంటే బాగుండేదని అనుకుంటున్నావ్ అని మోనాల్‌ను నాగార్జున అడిగితే అభిజిత్ పేరు చెప్పింది. బయటకు వెళ్లాక ఎవరితో స్నేహం చేయవు అని సోహెల్‌ను అడిగితే అభిజిత్ పేరు చెప్పాడు. ముందు ఒకలా వెనకలా ఒకలా మాట్లాడే వారు ఎవరు అని అఖిల్‌ను అడిగిత్ అభిజిత్ పేరు చెప్పారు.
ఆ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్..
అయితే ఆ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అభిజిత్ తమ ఫేవరేట్ కంటెస్టెంట్అని చెప్పారు. అఖిల్ అన్నయ్య అయితే ఏకంగా అభిజిత్ గారు అంటూ సంభోదించాడు. మీకు పెద్ద ఫ్యాన్ అని అనేశాడు. మోనాల్ మదర్ కూడా అదే మాట చెప్పింది. అందరిలోకెల్లా అభిజిత్ అంటేనే ఇష్టమని చెప్పింది. సోహెల్ తమ్ముడు అయితే ఏకంగా సోహెల్‌కు కౌంటర్ వేశాడు.
అభిజిత్ అన్నలానే క్లాస్..
సోహెల్ ప్రతీసారి అభిజిత్‌తో పోల్చుకుంటూ క్లాస్ మాస్ అనే తేడాను చూపిస్తాడు. అభి క్లాస్.. తాను మాస్ అంటూ ప్రొజెక్ట్ చేసుకుంటాడు. నిన్నటి ఎపిసోడ్‌లోనూ అలానే తనది తాను మాస్ అంటూ అభి క్లాస్ అంటూ చెప్పుకున్నాడు. అయితే సోహెల్ తమ్ముడు మాత్రం అభికి సపోర్ట్ చేస్తూ.. నేను అభిజిత్ అన్నలా క్లాస్.. ఆయనకు ఎక్కడ ఎలా మాట్లాడాలో అన్నీ తెలుసు.. స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు అని పొగిడేశాడు. ఆ మాటలతో సోహెల్ తమ్ముడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.