ఇది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ నాకు.. కన్నీటితో సోహెల్ మనోవేదన

బిగ్ బాస్ 4 రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఇక కంటెస్టెంట్స్ మధ్య అభిప్రాయాలు నిమిషాల్లోనే మారిపోతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు అందరు కలిసి తీసుకునే నిర్ణయాలు కొందరికి ప్లస్ అవ్వచ్చు. కొన్నిసార్లు రివర్స్ కూడా కావచ్చు. ఈ వారం ఎవరు ఎలిమినెట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హౌజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా కసిగా గేమ్ అడుతున్నారు. సోహెల్ అయితే తన కోపం డోస్ కూడా పెంచుతున్నాడు.

ఇటీవల అరియానాతో అతను గొడవ పడిన విధానంతో హౌజ్ లో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యింది. అరియానా కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా లేడీస్ సెంటిమెంట్ తో సోహెల్ ను గట్టిగానే తిట్టేసింది. అయితే సోహెల్ ఏమనుకున్నాడో ఏమో గాని బిగ్ బాస్ దగ్గరకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు. కావాలని తిట్టలేదు బిగ్ బాస్ అంటూ తనలోని ఆవేదనను కన్నీటితో వివరించాడు. కోపం ఒక్కటే మైనెస్ బిగ్ బాస్ మరేది లేదు నాకు. ఆమెతో గోడవపెట్టుకోవాలని అసలు లేదు. ఎదో అలా జరిగిపోతోంది. నిజంగా బిగ్ బాస్ నేను కావాలని చేయలేదు బిగ్ బాస్ అంటూ.. సోహెల్ చిన్నపిల్లడిలా కన్నీరు పెట్టుకున్నాడు.

Bigg boss 4 telugu Sohel emotional on ariyana fight

అరియానా విషయంలో చాలా ఎమోషనల్ అయిన సోహెల్ ఒక విధంగా తన అభిమానుల మనసును గెలుచుకున్నాడు. ఇన్ని రోజులు చాలా ఓపెన్ మైండ్ తో గేమ్ ఆడిన సోహెల్ ఈ వారం కూడా అలానే ఆడాలని చూస్తున్నాడు. కానీ అరియానా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇక హారిక, మోనాల్, తరువాత డేంజర్ జోన్ లో ఉన్నది సోహెల్, అరియానానే. అందుకే వారిద్దరి మధ్య పోటీ తీవ్రత ఎక్కువయ్యింది. గొడవలు జరిగితే ఎవరు తగ్గడం లేదు. ఇక చివరికి బిగ్ బాస్ దగ్గర కన్నీరు పెట్టుకున్న సోహెల్ అభిమానుల మనసులను కదిలించాడో లేదో తెలియాలి అంటే ఈ వారం ఎలిమినేషన్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X