twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కండలు వాడేస్తే మగాడివా?.. సోహెల్‌-అభిజిత్ మధ్య మాటల యద్దం

    |

    బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్‌లో మాటల యుద్దాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఒకరిపై ఒకరు విరుచుకుపడటం, ఫిజికల్ టాస్క్‌లో రెచ్చిపోవడం, దూషణలతో ఒకరిని కించపర్చడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే అవి హద్దులు కూడా మీరుతున్నాయి. గత వారం నాటి ఉక్కు హృదయం టాస్క్‌లో అందరూ కలిసి అభిజిత్‌ను ఎంతగా దూషించారో అందరం చూశాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగినట్టు కనిపిస్తోంది.

    మగాడివి కాదా?

    మగాడివి కాదా?

    ఉక్కు హృదయం టాస్క్‌లో రోబో టీం సభ్యుడైన అభిజిత్ టాస్కుకు దూరంగా గొడవలకు దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే కండబలం వాడలేదు గానీ మెదడుని వాడాడు. దివిని కిడ్నాప్ చేద్దాం చార్జింగ్ పెట్టుకుందామని ఐడియా ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఇలా చేయడంతో అభిని అఖిల్, సోహెల్, మెహబూబ్ అందరూ దారుణంగా తిట్టారు. మగాడివి కాదా? అంటూ రెచ్చిపోయారు.

    డిస్క్‌ల టాస్క్..

    డిస్క్‌ల టాస్క్..

    ఇక ఈ నాల్గో వారంలోనూ బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చినట్టు కనిస్తోంది. గత సీజన్‌లో రాళ్లను విసిరే టాస్క్ పెట్టిన బిగ్ బాస్.. ఈ సారి డిస్క్‌లను విసిరాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలను చూస్తుంటే టాస్క్ ఎంత హీటెక్కిందో తెలుస్తోంది. ఒకరిని ఒకరు తోసుకోవడం, ఒకరి మీద ఒకరు పడిపోవడంతో రచ్చ రచ్చగా జరిగినట్టు కనిపిస్తోంది.

    సోహెల్ మాటల తూటాలు..

    సోహెల్ మాటల తూటాలు..

    ఇక ఈ టాస్క్‌లోనూ అభిజిత్ దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఫిజికల్ టాస్క్‌ అంటే అలానే ఉంటుంది. నీకు దమ్ము లేదు నువ్ రాలేదు అంటూ అభిజిత్‌ను ఘోరంగా అవమానించాడు సోహెల్. సరే నాకు దమ్ములేదు అయితే నువ్ మగాడివా.. కండలు వాడేస్తే మగాడివి అయిపోతావా? అంటూ అభిజిత్ కౌంటర్ వేశాడు.

    Recommended Video

    Psycho Varma Movie Song Making Video | Natti Kumar | Natti Kranthi

    చాలా వీక్

    ఆ రోజు అందరం వస్తూ.. ఎలిమినేట్ చేయండి అంటూ చెప్పావ్.. బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ఇవ్వకండి.. పాపం అభి చాలా వీక్.. ఫిజికల్ టాస్క్‌లో.. మళ్లీ అమ్మాయిలను పెట్టి ఆడతాడు.. జాగ్రత్త బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ఇవ్వొద్దు.. అంటూ అభిజిత్‌పై సెటైర్స్ వేశాడు. మరి ప్రోమోలో ఇంత హీటెక్కించిన వ్యవహారం పూర్తి ఎపిసోడ్ వచ్చే సరికి ఎలా ఉంటుందో చూడాలి.

    English summary
    Bigg Boss 4 Telugu Sohel Fires On Abhijeet About Physical Task, Sohel satires On Abhijeet And Humiliates for Not Involving In Physical Task
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X