వేడేక్కిన టాస్క్.. కథ వేరేలా ఉంటుందట.. అమ్మ రాజశేఖర్‌పై సోహెల్ ఫైర్
బిగ్‌బాస్ షో నాల్గో వారంలోని కెప్టన్సీ టాస్క్ ఓ రేంజ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కిల్లింగ్ కాయిన్స్ ఆట ఇంటి సభ్యులందరి మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే టాస్కులో కుమ్ములాటలు, దొంగాటలు మొదలయ్యాయి. ఒకరి సొమ్మును మరొకరు కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో గొడవలు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. అమ్మ రాజశేఖర్, సోహెల్ మధ్య ఓ రేంజ్‌లో వాగ్వాదం జరిగింది.

కిల్లింగ్ కాయిన్స్..
నాల్గో వారంలో కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. కిల్లింగ్ కాయిన్స్ అంటూ ఇంటి సభ్యుల మధ్య పోటీ పెట్టాడు. ఇందులో ఐదుసార్లు బజర్ మోగుతుంటాయని.. అలా మోగిన ప్రతీసారి కాయిన్స్ పడుతుంటాయి. వాటిని సేకరించాలి..భద్రపరుచుకోవాలని తెలిపాడు. చివరకు ఎవరి దగ్గర ఎక్కువ విలువ గల కాయిన్స్ ఉంటాయో వారికి ప్రత్యేక అవకాశాలు ఉంటాయని పేర్కొన్నాడు.

సోహెల్ దొంగ అంటూ..
కాయిన్స్ సేకరించే క్రమంలో ఇతరుల వద్ద ఉన్న వాటిని కూడా దొంగిలించవచ్చు అనే మార్గం కూడా ఉండటంతో కొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలో దివి సోహెల్‌ను దొంగ అంటూ అనడంతో గొడవ మొదలైంది. దివిపై సోహెల్ విరుచుకుపడ్డాడు.

గ్రూపులు కట్టి..
కిల్లింగ్ కాయిన్స్ అనే ఈ టాస్కులో అందరూ గ్రూపులు కట్టి ఆడుతున్నారు. అలా ఆడకూడదు.. ఎవరి ఆట వారే ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించినా.. మళ్లీ అదే పంథాలో కంటెస్టెంట్లు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. మొదటి నుంచీ దివి, అమ్మ రాజశేఖర్ ఒకటిగానే ఆడుతూనే ఉన్నారు.

ఇదే విషయంలో గొడవ..
అయితే టాస్క్‌లో అందరూ గ్రూపులు కట్టారని, తననే టార్గెట్ చేస్తున్నారని అమ్మ రాజశేఖర్‌పై సోహెల్ ఫైర్ అయ్యాడు. టాస్క్‌లో మొదటి నుంచి దివికి అనుకూలంగా ప్రవర్తించడం అందరికీ తెలుస్తూనే ఉంది. మళ్లీ అలాంటి ఘటనే ఎదురవ్వడంతో సోహెల్ ఈసారి కాస్త గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Recommended Video
కథ వేరేలా ఉంటుంది..
కథ వేరేలా ఉంటుంది అనే డైలాగ్ సోహెల్‌కు ఊత పదంలా ఉంది. గత వారం టాస్కులోనూ ఇదే డైలాగ్‌తో ఊగిపోయాడు. తాజాగా అమ్మ రాజశేఖర్‌పైనా ఫైర్ అయ్యాడు. కొడతావా? ఏంట్రా అని మాస్టర్ కూడా ముందుకు వచ్చాడు. మరి ప్రోమోలోనే ఈ ఫైర్ ఉంటుందా? ఎపిసోడ్‌లోనూ ఇలానే ఉంటుందా.? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











