మా అన్న ఉంటాడు.. కంటతడి పెట్టిన అఖిల్‌కు ధైర్యం చెప్పిన సోహెల్

బిగ్ బాస్ హౌజ్ లో సోమవారం నెవర్ బిఫోర్ అనేలా కొందరు కంటెస్టెంట్స్ చాలా స్వార్థంగానే ఆలోచించారు. మొండిగా ఉన్నా కూడా ఎఫెక్ట్ తప్పదు. అలాగే త్యాగానికి సిద్దమైన కూడా మైనస్ కావచ్చు. కంటెస్టెంట్స్ వారి నిర్ణయాలను బట్టి నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే సోమవారం స్నేహాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. కీలకమైన ఎలిమినేషన్ లో మోనాల్, సోహెల్ లో ఎవరినో ఒకరిని ఒప్పించి సేవ్ అవ్వాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు.

అయితే దురదృష్టవశాత్తు డేంజర్ జోన్ లో ఉన్న అఖిల్ మొదట మోనాల్ ని టార్గెట్ చేశాడు. కానీ ఆమె మొండిగా వాదించి నేను కదిలేది లేదన్నట్లుగా కౌంటర్ ఇచ్చింది. మోనాల్ తన కోసం తప్పకుండా త్యాగం చేస్తుందని అనుకున్న అఖిల్ కు ఊహించని దెబ్బ పడినట్లయింది. అయితే అతని కోసం మధ్యలో స్వాప్ అవ్వడానికి రెడీ అయ్యాడు సోహెల్. కానీ అందుకు అఖిల్ ఒప్పుకోలేదు. ఇక చివరలో అఖిల్ కంటతడి పెట్టుకోవడంతో ధైర్యం చెప్పాడు సోహెల్.

Bigg boss 4 telugu Sohel positive support to akhil

మా అన్న ఉంటాడు ఎలిమినెట్ కాడు అంటూ సోహెల్ బూస్ట్ ఇచ్చిన విధానంతో కాస్త కుదుటపడిన అఖిల్.. మోనాల్ కొట్టిన దెబ్బను మాత్రం మర్చపోలేదని చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక చివరలో హారిక పవర్ ద్వారా అభి సేవ్ అవ్వగా..మోనాల్ ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చేసింది. ఇప్పుడు ఆమెతో పాటు అరియానా, అవినాష్, అఖిల్ నామినేట్ అయ్యారు. అయితే సేవ్ అవ్వడానికి బిగ్ బాస్ మరో అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పాడు. ఆ ట్విస్ట్ ఏమిటో మంగళవారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X