ఏం పీకారని మీకు ఇంతలా ఇస్తున్నారు.. మేమున్న రోజుల్లో ఇలా లేదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై శ్రీముఖి

బిగ్ బాస్ చివరి దశకు చేరుకోగానే నెవర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. గతంలో ఎప్పుడు లేని విధంగా మాజీ కంటెస్టెంట్స్ ను ప్రస్తుతం హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు కనెక్ట్ చేసి మాట్లాడించారు. ఇరువురి మధ్య జరిగిన చర్చలు మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాయి. కొందరు ఓవరాక్షన్ చేసినప్పటికి శ్రీ ముఖి, హరితేజ కొట్టిన డైలాగ్స్ గట్టిగానే పేలాయి.

ఈ సారి రేటింగ్స్ దక్కడం కష్టమే..

ఈ సారి రేటింగ్స్ దక్కడం కష్టమే..

బిగ్ బాస్ మొదలైనప్పుడు అసలు ఈ సారి రేటింగ్స్ దక్కడం కష్టమేనని అంతా అనుకున్నారు. హౌజ్ లోకి అడుగు పెట్టిన వారిలో చిన్న తరహా సెలబ్రెటీలు అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. అంచనాలను అందుకోవడంటంలో బిగ్ బాస్ కాస్త నిరాశపరిచిన మాట వాస్తవమే. అయితే రోజులు గడిచిన కొద్దీ కంటెస్టెంట్స్ మంచి క్రేజ్ అందుకున్నారు.

మాజీ కంటెస్టెంట్స్ తో సరదాగా..

మాజీ కంటెస్టెంట్స్ తో సరదాగా..

ఒక విధంగా బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన తరువాతే చాలా మంది కంటెస్టెంట్స్ కు ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పాలి. టాస్కులతో వారి టాలెంట్ ను బయటపెడుతూ ఆడియెన్స్ బాగానే దగ్గరయ్యారు. ఇక ఇప్పుడున్న టాప్ 5 ఫైనలిస్ట్స్ లలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ బాగానే హైప్ క్రియేట్ చేసింది. ఇక మంగళవారం ఎపిసోడ్ లో కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేశారు.

మేమున్న రోజుల్లో..

మేమున్న రోజుల్లో..

సీజన్ 1 ఫైనలిస్ట్ హరితేజ, సీజన్ 2 రన్నరప్ గీతామాధురి, సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి అలాగే మూడవ సీజన్ కంటెస్టెంట్ అలీ రేజా.. స్పెషల్ గెస్టులుగా సీజన్ 4 కంటెస్టెంట్ తో మాట్లాడారు. ఒక్కొక్కరు వారి అనుభవాల్ని తెలుపుతూ గోల గోల చేశారు. ఇక మేమున్న రోజుల్లో అలా ఉండేది కాదని, కనీసం మంచి సౌకర్యాలు కూడా ఉండేవి కావని మాజీ కంటెస్టెంట్స్ పంచ్ లు వేశారు.

ఏం పీకుతున్నారని..

ఏం పీకుతున్నారని..

సీజన్ 1 లో ఎంతగానో కష్టపడ్డామని హరితేజ వివరణ ఇవ్వగా సీజన్ 4 మాత్రం మంచి మంచి వంటకాలు ఐస్ క్రీమ్ లు కూడా దొరుకుతున్నాయని అన్నారు. అలాగే శ్రీ ముఖి కూడా తనదైన శైలిలో పంచ్ లు వేసింది. నిజంగానే వీళ్ళకు మటన్, చికెన్ లు ఇస్తున్నారు అంటూ అద్భుతమైన వంటకాలు కూడా.. ఏం పీకుతున్నారని అంతలా ఇచ్చేస్తున్నారు అంటూ మాజీ కంటెస్టెంట్స్ సరదాగా మాట్లాడారు.

ఇలాంటివి మేము చూడలేదు..

ఇలాంటివి మేము చూడలేదు..

వంటలు చేసుకోవడానికే వివిధ సదుపాయాలు ఇచ్చారు వీళ్ళకు. మిక్సీ గ్రైండర్స్ కూడా ఉన్నాయి. మటన్ అయితే గట్టిగానే ఇస్తున్నారు. మేము మాత్రం అలాంటివి చూడలేదు. దంచుకొని వంటలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అంటూ కంటెస్టెంట్స్ ను ఆటపట్టించారు శ్రీ ముఖి, హరితేజ. అలాగే అఖిల్, మోనాల్ లవ్ స్టొరీపై కూడా చర్చ జరిగింది. కానీ మధ్యలో అరియానా మాత్రం కాస్త ఓవరాక్షన్ చేసినట్లు అనిపించింది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
సీక్రెట్ టాటూపై క్లారిటీ ఇచ్చిన శ్రీ ముఖి

సీక్రెట్ టాటూపై క్లారిటీ ఇచ్చిన శ్రీ ముఖి

ఇక బిగ్ బాస్ గుర్తుగా వేసుకున్న టాటూలపై కూడా శ్రీ ముఖి క్లారిటీ ఇచ్చింది. అవి ఫేక్ అనే రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ.. అందరూ కూడా అవి ఫేక్ అనుకున్నారు. కానీ నిజమని గీత మాధురి కూడా అదే తరహాలో స్పందిస్తూ నిజంగా బయటకు వెళ్లిన తరువాత అవి ఉంటాయని అనుకోలేదు. ఇక హరితేజకు కూడా ఛాన్స్ దొరికితే ఆ మూమెంట్ లో వేయించుకునేదేమో అంటూ శ్రీ ముఖి వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X