అరేయ్ అభి, బిగ్‌బాస్ ట్రోఫీ తీసుకొచ్చేయ్.. అమెరికా నుంచి వచ్చా రా.. దావత్ చేసుకుందాం: యువ హీరో

బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో ఫైనల్స్ లో ఉన్న వారిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనేది హాట్ టాపిక్ గా మారింది. టాప్ 5లో ఉన్న అభిజిత్, అరియానా, అఖిల్, సోహెల్, హారిక.. అందరు కూడా చాలమైన కాంటెస్టెంట్స్ అనే చెప్పాలి. అయితే వీరిలో ఎక్కువగా ఆడియెన్స్ సపోర్ట్ ఉన్నది మాత్రం అభిజిత్ కు మాత్రమే. కానీ బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే అభిజిత్ కు ఇతర స్టార్స్ కూడా కూడా మద్దతు ఇస్తున్నారు.

మరో వీడియో రిలీజ్ చేసిన సుధాకర్

మరో వీడియో రిలీజ్ చేసిన సుధాకర్

అభిజిత్ కోసం యువ నటుడు సుధాకర్ కోమాకుల కూడా స్పెషల్ వీడియోల ద్వారా మద్దతు అందిస్తున్నాడు. ఈ ఇద్దరు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచే చాలా క్లోజ్ అయ్యారు కూడా ఇక అభిజిత్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అలా వీడియో ద్వారా మద్దతు ఇచ్చిన సుధాకర్ ఇప్పుడు మరో వీడియోను రిలీజ్ చేశాడు.

నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి..

నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి..

సుధాకర్ మాట్లాడుతూ.. నా క్లోజ్ ఫ్రెండ్ అభిజిత్. ఇప్పుడు టైటిల్ విన్నర్ అయ్యే కంటెస్టెంట్స్ లలో ముందు వరుసలో ఉన్నాడు. రెండు నెలల క్రితం అబి కోసం ఒక వీడియో చేసినప్పుడు పాజిటివ్ కామెంట్స్ తో పాటు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే అప్పటికి ఇప్పటికి జనాల్లో అభిజిత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అభిజిత్ విన్నర్ అవ్వాలి..

అభిజిత్ విన్నర్ అవ్వాలి..

అభిజిత్ ను నేను బిగ్ బాస్ విన్నర్ గా చూడాలని అనుకుంటున్నాను. అయితే అతనికి ఆ అర్హత ఉందా లేదా అనే విషయం గురించి కూడా చెబుతాను. నిజానికి అభిజిత్ విన్నర్ అవ్వడానికి అతి ముఖ్యమైన కంటెస్టెంట్స్ అనిపిస్తోంది. నాకు ముందు నుంచే అభి తెలుసు. అతను చాలా మాంచి వ్యక్తి. అతను బిగ్ బాస్ లో సర్ ప్రైజ్ అయ్యే విధంగా పర్ఫామెన్స్ ఇచ్చాడు.

వెళ్లే ముందు అభితో మాట్లాడాను..

వెళ్లే ముందు అభితో మాట్లాడాను..

ఇప్పటివరకు అన్ని సీజన్స్ లతో పోలిస్తే ఏ కంటెస్టెంట్ కు దక్కని క్రేజ్ అభికి దక్కింది. అభిని చూసి సొసైటీలో ఇలా ఉంటే బావుంటుందని చాలా మంది వివరణ ఇచ్చారు. అభి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు టైటిల్ పేవరేట్ కాదనే చెప్పాలి. బిగ్ బాస్ కు వెళ్లే వారం ముందు నాతో మాట్లాడాడు. నేను అతనికి ఒక్కటే చెప్పే. అరేయ్ మామా ఒక్కసారి మనం దిగితే సిక్స్ పడాల్సిందేనని తెలిపాడు.

అప్పుడే అతనికి మంచి గుర్తింపు దక్కింది

అప్పుడే అతనికి మంచి గుర్తింపు దక్కింది

ఇక అభిజిత్ బయట ఎలా ఉన్నాడో అలాగే హౌజ్ లో కూడా ఉన్నాడు. అందుకే అందరికి అంత బాగా నచ్చేశాడు. ఎన్నిసార్లు నామినేషన్స్ లోకి వెళ్లినా కూడా ఆడియెన్స్ ఓట్లు వేసి గెలిపించారు. మొదట్లో ఫిజికల్ టాస్క్ లో కొన్ని నొప్పుల వలన అంత బాగా పెర్ఫామెన్స్ చేయని అభి రోబో టాస్క్ లో మాత్రం చాలా బాగా ఆడాడు. అప్పుడే మంచి నేమ్ వచ్చింది. అప్పటి నుంచి అతని గ్రాఫ్ తగ్గలేదు.

అదే అభిజిత్.. ప్లస్ పాయింట్

అదే అభిజిత్.. ప్లస్ పాయింట్

ఏ పరిస్థితులలో అయినా అభిజిత్ చాలా బ్యాలెన్స్ గా ఉన్నాడు. అదొక మెయిన్ ప్లస్ పాయింట్. సరదా ఉన్నప్పుడు సరదాగానే ఉన్నాడు. టాస్క్ లో భాగంగా ఫ్రెండ్స్ ను కూడా పక్కన పెట్టాడు. తప్పు జరిగితే క్షమాపణ కూడా చెప్పాడు. వెంటనే తప్పులను కూడా సరిదిద్దికున్నాడు. అందుకే అతనికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు సుధాకర్.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
మస్త్ దావత్ చేసుకుందాం

మస్త్ దావత్ చేసుకుందాం

మొత్తంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ 4 విన్నర్ గా అభిజిత్ నిలవాలి అంటూ సుధాకర్ చివరలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నాగరాజు క్యారెక్టర్ తో మంచి డైలాగ్ కూడా కొట్టడు. అరేయ్ మామా అభిజిత్ బిగ్ బాస్ ట్రోఫీ తీసుకొని రా.. B ఫేస్ మొత్తం ఎదురుచూస్తోంది. మస్త్ దావత్ చేసుకుందాం. ఎంజాయ్ చేద్దాం. అమెరికా నుంచి వచ్చిన రా బై నీ కోసం. తప్పకుండా బిగ్ బాస్ విన్నర్ కావాలని చెబుతున్నా చూడు.. అంటూ సుధాకర్ తనదైన శైలిలో మద్దతు ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X