బిట్టూ అని బిగ్‌బాస్ వాళ్లే పిలవమన్నారు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సుజాత

బిగ్‌బాస్ షోలో ఐదో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సుజాత. మామూలుగా ఈమె మరి అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న అభిప్రాయం జనాల్లో ఇంకా ఏర్పడలేదు. అయితే మొదటి రెండు మూడు వారాల్లో కొందరిపై నెగెటివిటీ ఎక్కువగా పెరగడంతో సుజాత బతికిపోయింది. మొదటి వారంలో సూర్య కిరణ్ అతి చేయడం వల్ల వెళ్లిపోయాడు. మొదటి వారంలో చేసిన తప్పుల వల్లే రెండో వారంలో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయింది. ఇలా ప్రతీ సారి సుజాత కంటే వీక్‌గా, నెగెటివిటీ ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్లు రావడంతో సుజాత సేవ్ అయింది.

జనాలు కాచుకునిఉన్నారు..

జనాలు కాచుకునిఉన్నారు..

మామూలుగా జనాలు కొంత మంది కోసం కాచ్చుకూర్చుంటారు. ఎప్పుడెప్పుడు నామినేషన్‌లోకి వస్తారా? ఎప్పుడు ఎలిమినేట్ చేసేద్దామా? అని చూస్తుంటారు. ఆ లిస్ట్‌లో అమ్మ రాజశేఖర్, సుజాత, మెహబూబ్ వంటి వారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఐదో వారం నామినేషన్ ప్రక్రియ జరిగిన వెంటనే సుజాత నామినేట్ అవ్వడంతో.. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ సుజాతే అని అందరూ ఫిక్స్ అయ్యారు.

సుజాతపై రెండు కారణాలు..

సుజాతపై రెండు కారణాలు..

సుజాత ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. అవసరమున్నా లేకపోయినా నవ్వడం, అది ఫేక్ అని జనాలు అనుకోవడం మొదటి కారణం. ఇక నాగార్జునను పట్టుకుని బిట్టూ అని పిలవడం మరీ కృతకంగా అనిపించడం. అలా పిలిచిన ప్రతీసారి జనాలు మాత్రం జీర్ణించుకోలేకపోవడం రెండో కారణం.

సుజాత క్లారిటీ..

సుజాత క్లారిటీ..

అయితే బిట్టూ అని పిలవడం వెనుక పెద్ద కథే ఉందట. తాను బిట్టూ అని పిలవడంతో బయట జనాలు ఫీల్ అవుతున్నారని, నాగార్జున గారి అభిమానులు హర్ట్ అయ్యారని తనకు తెలియదు, అలా పిలిచినందుకు క్షమించమని సుజాత కోరింది. ఇక అలా పిలవడం వెనుకున్న కథను కూడా వివరించింది.

బిగ్ బాస్ టీం..

బిగ్ బాస్ టీం..

ఇంట్లోకి వెళ్లేముందు బిగ్ బాస్ టీంసుజాతను నాగార్జున అంటే ఇష్టమేనా? అని అడిగారట. ఇష్టమే అని చెప్పడం, మనం సినిమా చాలా ఇష్టం అందులో బిట్టూ పాత్ర ఇంకా చాలా ఇష్టమని సుజాత చెప్పిందట. అయితే బిట్టూ అని పిలవడంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? అని బిగ్ బాస్ టీం ప్రశ్నించిందట.

Recommended Video

Wrong Gopal Varma Movie Official Trailer
ఏదైనా ఉంటే చెప్పేవారు...

ఏదైనా ఉంటే చెప్పేవారు...

ఒక వేళ తాను బిట్టూ అని పిలవడం బిగ్ బాస్ టీంకు ఇష్టం లేకపోయినా, నాగార్జున గారికి ఇష్టం లేకపోయినా కన్ఫెషన్ రూంలోకి పిలిచి చెప్పేవారని తెలిపింది. అయినా నేను బిట్టూ అని పిలిస్తే నాగార్జున గారు ఆనందపడేవారు అని తెలిపింది. అయన్ను అలా పిలిచినందుకు ఎవరైనా హర్ట్ అయ్యుంటే వారికి సుజాత సారీ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X