Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వామ్మో.. సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీనా? బిగ్ బాస్ 4 న్యూ ప్రోమో వైరల్.. తట్టుకోలేకపోతున్న నాగ్
బిగ్ బాస్ 4 నెవర్ బిఫోర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఎంతగా ట్రై చేస్తుందో మరోసారి అర్ధమయ్యింది. కంటెస్టెంట్స్ విషయంలో చాలా తక్కువగా ఆలోచించారని నెగిటివ్ కామెంట్స్ ఎక్కువవ్వడంతో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కొత్త షాక్ ఇస్తోంది. టాలీవుడ్ ఆల్ టైమ్ నెంబర్ వన్ యాంకర్ సుమ కూడా హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు కానీ.. ఇది నిజమని నమ్మాలి అంటే కాస్త కష్టంగానే ఉంది. కానీ ఆదివారం షోకి సంబంధించిన న్యూ ప్రోమో అయితే వైరల్ అవుతోంది.
యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీనా..?
యాంకర్ సుమ సాధారణంగా ఎలాంటి షోలో కనిపించినా కూడా జనాలు ఎట్రాక్ట్ అవుతారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాంకర్ గా కొనసాగుతున్న ఆమె ఇప్పుడు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. గత సీజన్ లోనే బిగ్ బాస్ లోకి ఒక గెస్ట్ గా వచ్చి అప్పుడే వెళ్లిపోయిన సుమ ఈ సారి మాత్రం కంటెస్టెంట్ గా ఉండి హౌజ్ మెంట్స్ తో పోరాడడానికి సిద్ధమైందని ప్రోమో ద్వారా ప్రచారం చేస్తున్నారు.
పారితోషికం ఎంత ఇచ్చారో?
న్యూ ప్రోమో విడుదల చేసిన స్టార్ మా ఒక్కసారిగా అంచనాల డోస్ ని పెంచేసింది. నిజంగా ఈ రేంజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని ఎవరు ఊహించలేదు. సగానికి చేరుకున్న బిగ్ బాస్ షోలో ముందు ముందు ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత పెరగాలని గట్టిగానే ప్లాన్ వేశారు. సుమకు పారితోషికం కూడా గట్టిగానే ఇచ్చి ఉంటారని చెప్పవచ్చు. ఇక నాగార్జున అయితే మరో 5వారాలు అంతకుమించిన ఎంటర్టైన్మెంట్ అంటున్నారు.
తట్టుకోలేకపోయిన నాగార్జున
ప్రోమోలో సుమ పంచ్ లకు నాగార్జున కూడా తట్టుకోలేక పోయాడు. కంటెస్టెంట్స్ తో ప్రతి ఒక్కరిని ఆమె ఫాలో అవుతున్నట్లు అర్ధమయ్యింది. అంటే ముందే ఆమె ఎంట్రీని ప్లాన్ చేసినట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది. ఇక ఆమె వేసిన పంచ్ లకు ప్రోమోనే ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇక ఎపిసోడ్స్ ఇంకా ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
రేటింగ్ రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా..
లాస్య, మోనాల్, అరియానా, సోహైల్, అభిజిత్, అవినాష్ అలాగే చాలా మంది కంటెస్టెంట్స్ ని అనుకరించిన సుమ తన పంచ్ లతో షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నాగార్జున కూడా తట్టుకోలేక వెళ్లిపోతున్నా అనేశాడు. చూస్తుంటే రేటింగ్ రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా గట్టిగానే ప్లాన్ వేశారని అర్ధమయ్యింది.
Recommended Video
అమ్మా రాజశేఖర్ ని తప్పించడానికే..
అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ వారం ఎలిమినేషన్ చాలా ఆసక్తికరంగా మారింది. షో నుంచి ఎవరు బయటకు వెళ్లిన కూడా రేటింగ్ పై గట్టి ప్రభావమే పడుతుందని టాక్ నడుస్తోంది. ఇక అమ్మా రాజశేఖర్ ని పంపడానికె ఈ ప్లాన్ వేశారని టాక్. ఇక వైల్డ్ కార్డ్ పేరుతో సుమను లోపలికి పంపిస్తున్నట్లు నాగ్ అయితే ప్రోమోలో చెప్పారు గాని షో మొదలయ్యేవరకు నమ్మలేము. అలాంటి షోలోకి ఆమె వెళ్లడం వెనుక నెటిజన్లు ఇది ప్రమోషన్స్ స్టంట్ అయ్యి ఉండవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.