అక్కడ చాలా జరుగుతున్నాయి.. దేవీ నాగవల్లితో లవ్ ట్రాక్ నడుపుదామనుకున్నా.. సూర్య కిరణ్ కామెంట్స్
బిగ్‌బాస్ షోలో ఫేమస్ అవ్వాలంటే ఈజీ పద్దతి ఒకటి ఉంటుంది. మంచి రిలేషన్ షిప్, ఓ తెలియని రహస్య బంధం, లవ్ ట్రాక్ వంటివి నడిపిస్తే ఆ జంట ఇట్టే ఫేమస్ అవుతుంది. తేజస్వీ సామ్రాట్, రాహుల్ పునర్నవి ఇలాగే ఫేమస్ అయ్యారు. ఇక ఈ నాల్గో సీజన్‌లోనూ అలాంటి జంటలు పుట్టుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు మొదటి వారమే ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ షో గురించి సంచలన కామెంట్స్ చేశాడు.

కంటెస్టెంట్లపై కామెంట్స్..
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల గురించి సూర్య కిరణ్ మాట్లాడుతూ.. హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరు టాప్ అని చెప్పలేను కాని.. గంగవ్వ హౌస్‌లో కొనసాగితే ఆమె టాప్‌లో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత నోయల్, దివి, యాంకర్ దేవి, అభిజిత్‌లు టాప్‌లో ఉంటారని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

దేవీ నాగవల్లిపై ప్రశసంలు..
బిగ్‌బాస్‌లోకి రాక ముందు దేవి తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె చాలా మెచ్యూర్డ్‌గా గేమ్ ఆడుతోందని, చాలా కష్టపడుతోందని పేర్కొన్నాడు. తన అభిప్రాయం ప్రకారం టాప్ ఫైనల్ కంటెస్టెంట్స్‌లో దేవి ఉంటుందని నొక్కి మరీ చెప్పాడు.

లవ్ ట్రాక్‌లు చాలానే..
హౌస్‌లో చాలా లవ్ ట్రాక్‌లు నడుస్తున్నాయి. అఖిల్-మొనాల్-అభిజిత్‌ల మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీతో పాటు.. అరియానా-మొహబూబ్‌ల కొత్త ట్రాక్ త్వరలో మీరు చూస్తారని కొత్త విషయాన్ని తెలిపాడు. ఎవరికి వాళ్లు సెట్ చేసుకున్నారని చెబుతూ..తాను హౌస్‌లో ఉండి.. తననూ ఓ లవ్ ట్రాక్ నడపమంటే.. టీవీ9 దేవితో లవ్ ట్రాక్ నడిపేవాడినంటూ మనసులోని మాట బయటకు చెప్పేశాడు. ఆమె డైవోర్స్.. నేనూ డైవోర్స్.. కాబట్టి ఆమెతో ఒక ట్రాక్ నడుపుదాం అనుకున్నా అని చెప్పుకొచ్చాడు.
Recommended Video

రెమ్యూనరేషన్‌పైనా..
నిజానికి బిగ్‌బాస్ లోకి తాను వెళ్ళడానికి ప్రధాన కారణం ప్రైజ్ మని కోసమైతే కాదని స్పష్టం చేశాడు సూర్య కిరణ్. జనాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నానని సో ఈ బిగ్‌బాస్ ఫ్లాట్ ఫాం ద్వారా వారిని ఒకసారి దగ్గరవ్వాలనే ఆలోచనతోనే వచ్చానని పేర్కొన్నాడు. ఇక బిగ్ బాస్ ద్వారా తనకు మంచి రెమ్యునరేషన్ దక్కిందని అడిగిన దానికంటే పదింతలు ఎక్కువగా ఇచ్చారని అసలు విషయం దాచి పెట్టేశాడు.


Click it and Unblock the Notifications











