అఖిల్-అభిజిత్‌ ఇద్దరితోనూ.. మారుతున్న స్టోరీలు.. స్వాతి దీక్షిత్ స్ట్రాటజీ అదేనా!!

బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత మంచి ప్లానింగ్‌తో వచ్చినట్టే కనిపిస్తోంది. వచ్చీ రావడంతోనే కొద్ది మందితోనే మూవ్ అవ్వడం, వారితోనే మాట్లాడటం చూస్తుంటే ఆమె మైండ్‌లో ఏదో గేమ్ రన్ అవుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చిన మొదటి రోజే అభిజిత్‌తో బాగానే మాట్లాడింది. రాత్రి మళ్లీ సపరేట్‌గా ముచ్చటించుకున్నారు. ఇక స్వాతి వ్యవహారంపై ఇంటి సభ్యులు కూడా ఓ కన్నేసినట్టు అనిపిస్తోంది.

అందుకే నామినేషన్..

అందుకే నామినేషన్..

స్వాతి కొందరితో మాట్లాడుతోందని, వచ్చిన మొదటి రోజు నుంచే స్ట్రాటజీ ప్లే చేస్తోందని లాస్య నాగార్జున ఎదుటే చెప్పేసింది. ఇక అమ్మ రాజశేఖర్ సైతం నామినేషన్‌లో అదే కారణం చెప్పి నామినేట్ చేసేశాడు. సోహల్, మెహబూబ్ కూడా అదే విషయాన్ని ప్రస్థావిస్తూ ముచ్చటించుకున్నారు.

అఖిల్‌తో అలా..

అఖిల్‌తో అలా..

స్వాతి దీక్షిత్ నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌తో స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చుని బాగానే ముచ్చట్లు పెడుతోంది. ఇక వీరిద్దరూ పెట్టే ముచ్చట్లు వినలేక మోనాల్ లేచిపోతూ ఉంటే స్వాతి ఆపింది. కానీ మీరే మాట్లాడుకోండి అంటూ మోనాల్ వెళ్లిపోయింది. అలా మోనాల్-అఖిల్ మధ్య దూరే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరో వైపు టాస్క్‌లో ఇలా..

మరో వైపు టాస్క్‌లో ఇలా..

నాల్గో వారం కెప్టెన్సీ టాస్క్‌లో కిల్లింగ్ కాయిన్స్ అంటూ టాస్క్ ఇచ్చాడు. అందులో పైనుంచి విసిరే కాయిన్స్‌ను సేకరిస్తూ భద్రపరుచుకోవాలని తెలిపాడు. ఎవరి వద్ద ఎక్కువ విలువ గల కాయిన్స్ ఉంటాయో వారికి ప్రత్యేకమైన సదుపాయాలుంటాయని అందరిలోనూ ఆశను పుట్టించాడు. ఈ టాస్క్‌లో స్వాతి దీక్షిత్, అభిజిత్‌తో కలిసి ఆడింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
జంటలుగా ఆట..

జంటలుగా ఆట..

కిల్లింగ్ కాయిన్స్ అనే ఈ టాస్క్‌లో అభి స్వాతి, అఖిల్ మెనాల్, దివి మాస్టర్, సోహెల్ మెహబూబ్ ఇలా అందరూ జంటలుగా గ్రూపులు కట్టి ఆడారు. అయితే అలా ఆడ కూడదని, ఎవరికి వారే ఆడాలని బిగ్ బాస్ ఆదేశించడంలో అందరూ షాక్ తిన్నారు. అయితే అభితో స్వాతి క్లోజ్‌గా ఉందనో ఏమో గానీ ఈ టాస్క్‌లో హారిక వీరి దగ్గరకే రాలేదు. మొత్తానికి స్వాతి మాత్రం గట్టిగానే ఏదో ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X