మెగాస్టార్‌తో సోహెల్ మూవీ.. ఆలస్యం కావడానికి కారణమిదే.. త్వరలోనే అప్డేట్?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో టైటిల్ విన్నర్ గా నిలవకపోయినా కూడా సయ్యద్ సోహెల్ రియాన్ కు భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. బిగ్ బాస్ కంటే ముందు వరకు పెద్దగా ప్రజాదరణ అందుకోని ఈ టాలెంటెడ్ నటుడు మొత్తానికి బిగ్ బాస్ ద్వారా అభిమానులను భారీ స్థాయిలో అందుకున్నాడు. ఇక ఎలాగైనా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి అతని సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన కొన్ని రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సరైన ట్రాక్ లోకి..
సయ్యద్ సోహెల్ రియాన్.. మొదట సీరియల్స్ ద్వారా ఆడియెన్స్ కు దగ్గరైన విషయం తెలిసిందే. అనంతరం కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో క్రేజ్ దక్కలేదు. ఇక బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన సోహెల్ ఇప్పుడు కెరీర్ ను సరైన ట్రాక్ లోకి తేవడానికి అడుగులు వేస్తున్నాడు.

గెలకపోయినా కూడా
బిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్ తన రియల్ క్యారెక్టర్ తో జనాలకు బాగానే కనెక్ట్ అయ్యాడు. అతని వినూత్నమైన స్టైల్ జనాలను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఫైనల్ వరకు కష్టపడి వచ్చిన సోహెల్ టైటిల్ పోటీలో గెలకపోయినా కూడా దాదాపు అభిజిత్ రేంజ్ లోనే క్రేజ్ అందుకున్నాడు. ఫైనల్ లో 25లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు కూడా.

ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు
అయితే ఫైనల్స్ లో మెగాస్టార్ సోహెల్ కు ఒక మాట ఇచ్చిన విషయం తెలిసిందే. తప్పకుండా నీ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానని చిరంజీవి మాట ఇవ్వడంతో ఆ విషయం అప్పట్లో అందరిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. సోహెల్ ఆ ఛాన్సును ఏ మాత్రం మిస్ చేసుకోకూడదని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే అతని తరువాత సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉంటారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు.

అవకాశం అయితే ఉందట
సోహెల్ ప్రస్తుతం జార్జిరెడ్డి నిర్మాతలతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఇక శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయట. అయితే ఇందులో మెగాస్టార్ ను గెస్ట్ రోల్ చేయించడానికి అవకాశం అయితే ఉందట కానీ ఇంకా ఆ పాత్రపై ఎలాంటి నిర్ణయానికి రాలేదని సమాచారం.

హై వోల్టేజ్ సీన్స్
మెగాస్టార్ చిరంజీవి క్లైమాక్స్ లోనే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే సీన్ కు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ మొత్తం సిద్దమైన తరువాతే మెగాస్టార్ ను కలవాలని అనుకుంటున్నారాట. ఆలస్యం అయినా సరే చిరు కోసం హై వోల్టేజ్ సీన్స్ రెడీ చెయ్యాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పై త్వరలోనే ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











