బిగ్‌బాస్ ఫైట్: అభిజిత్ కథ క్లైమాక్స్‌కు వచ్చిందా.. నోయల్ ఏం చేయబోతున్నాడు?
బిగ్ బాస్ హౌజ్ లో రోజుకో గొడవతో కంటెస్టెంట్ క్రేజ్ లో చాలా మార్పులు వస్తున్నాయి. రేటింగ్ పెంచే క్రమంలో నిర్వాహకులు నెవర్ బిఫోర్ అనేలా టాస్కులను వదులుతూ కంటెస్టెంట్స్ మధ్య కోపాగ్నిని రాజేస్తున్నారు. బిగ్ బాస్ క్లైమాక్స్ కి కూడా ఎంతో దూరం లేదు. ఇక ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ క్లైమాక్స్ లో మాత్రం సోమవారమే ఒక క్లారిటీ వస్తోంది. ఇక ఈ సారి కంటెస్టెంట్స్ అభిజిత్ ని ఎక్కువగా టార్గెట్ చేసినట్లు అర్ధమయ్యింది.

ఆమె తరువాత అభికి ఎక్కువ క్రేజ్
బిగ్ బాస్ హౌజ్ లో కొంత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే లాస్య తరువాత అభిజిత్ అనే చెప్పాలి. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసి మంచి క్రేజ్ అందుకున్న అభికి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళగానే అమ్మాయిలా సపోర్ట్ బాగానే లభించించినట్లు అర్ధమయ్యింది. మధ్యలో సమంత కూడా అతని క్రేజ్ గురించి గట్టిగానే చెప్పింది.

ఈ సారి టార్గెట్.. అభిజిత్..
అయితే హౌజ్ లో ఇప్పుడు అభిజిత్ టార్గెట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అభికి ఫాలోయింగ్ గట్టిగానే ఉందని హౌజ్ మెంట్స్ కి బాగా తెలుసు. అయితే ప్రతిసారీ కూడా అతను టాస్క్ లలో కూడా పెద్దగా కష్టపడింది లేదనే నెగిటివ్ కామెంట్స్ అందుకోవడం కామన్ అయ్యింది. రెండు వారాల క్రితం అమ్మా రాజశేఖర్ టార్గెట్ చేసి అభిపై రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అయితే చివరికి ఆయనే వెళ్లిపోక తప్పలేదు.

అభి గుండెల్లో గుచ్చిన ఆ నలుగురు
అభిజిత్ కి ఆడియెన్స్ సపోర్ట్ ఎంత ఉందో గాని అతనితో గొడవ పెట్టుకున్న అవినాష్ కూడా అమ్మా రాజశేఖర్ తో ఎలిమినేషన్ లోకి వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆయినప్పటికి ఈ సారి మళ్ళీ అభినే నామినేట్ చేశాడు. ఇక అఖిల్ ఎప్పటిలానే గుండెల్లో గుచ్చి నామినేట్ చేయగా.. అరియానా, సోహైల్ కూడా అభిపై ఆగ్రహంతో డేంజర్ జోన్ లోకి తెచ్చారు.

శత్రువులు పెరుగుతున్నారు
మొత్తంగా ఈ వారం అత్యధికంగా నలుగురు నామినేట్ చేయడంతో అభి టార్గెట్ అయ్యాడనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక అతని తరువాత మోనాల్ ని ముగ్గురు నామినేట్ చేశారు. అభిజిత్ టార్గెట్ అవ్వడానికి ప్రధానం కారణం అతని గ్యాంగ్ సభ్యులు తగ్గడమే. సోహైల్ తో కూడా తేడా కొట్టేసింది. ఇక అభి సేవ్ అవ్వాలి అంటే ఆడియెన్స్ సపోర్ట్ ఇప్పుడే చాలా అవసరం.
Recommended Video

నోయల్ ఏం చేస్తాడో..
నోయల్ హౌజ్ లో నుంచి బయటకు వెళ్లిపోయిన సమయంలో ఒక మాట అన్నాడు. నువ్వు ఆపదలో ఉన్నావని తెలిస్తే తప్పకుండా హౌజ్ బయట నీకు సపోర్ట్ చేసే విదంగా నేను ఉంటాను అని నోయల్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. మరి నోయల్ ఇచ్చిన మాట ప్రకారం అభిజిత్ కోసం ఏమైనా హైప్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి..


Click it and Unblock the Notifications











