Bigg Boss Telugu 4: ఈ వారం అతని పనైపోయినట్లే.. ఎలిమినెట్ కాబోయేది ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ సారి పెద్దగా సర్ ప్రైజ్ ఇవ్వలేదనే చెప్పాలి. ఒక్క అవినాష్ తప్పితే ఇతరులు చాలా వరకు నిరుత్సాహ పరిచారు. ఇక మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందని గత కొన్ని వారాలుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక మొత్తానికి ఈ వారం ఎలిమినెట్ కాబోయేది ఎవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక అందరి చూపు ఒక్కడి పైనే ఉంది. అతను మరెవరో కాదు. కుమార్ సాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కుమార్ సాయి ఎలిమినేటెడ్!! | Filmibeat Telugu
ఒక క్లారిటీ వచ్చేసింది

ఒక క్లారిటీ వచ్చేసింది

షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో ఆడియెన్స్ చాలా వరకు నిరాశ చెందారు. కానీ ఆ తరువాత టాస్క్ లలో ఊహించని విదంగా కొంతమంది ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వడంతో షో రేటింగ్ కూడా ఊపందుకుంది. నాగార్జున కూడా ప్రతి వారం ఎలిమినేషన్ టైమ్ లో ఊహించని విధంగా ట్విస్ట్ ఇస్తున్నాడు. ఇక ఆదివారం ఎవరి హౌజ్ నుంచి బయటకు వెళతారు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది.

వెళ్లిపోయేది అతనే..

వెళ్లిపోయేది అతనే..

ఆరవ వారం నామినేషన్లలో 9 మంది సభ్యులు ఉన్నారు. దివి, అరియానా, నోయెల్, హరికా, అభిజీత్ మరియు లాస్య. ఇక హౌస్ కెప్టెన్ సోహెల్ ప్రత్యేక పవర్ తో మెహబూబ్‌ను రక్షించాడు. అయితే ఫైనల్ గా కుమార్ సాయిని ఈ వారంలో హౌజ్ నుంచి బయటకు పంపబోతున్నట్లు తెలుస్తోంది. కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కుమార్ సాయి ఎలిమినెట్ అవ్వడానికి కారణం

కుమార్ సాయి ఎలిమినెట్ అవ్వడానికి కారణం

అతను దాదాపు ప్రతి వారం నామినేట్ అవుతున్నాడు. ఇక ఇంట్లో మిగతా వాళ్ళతో పోలిస్తే కుమార్ పెద్దగా ఫోకస్ అయ్యింది లేదు. వెండితెరపై కమెడియన్ గా క్లిక్కయినప్పటికి బిగ్ బాస్ లో మాత్రం పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. పైగా ఫిజికల్ టాస్క్ లలో కూడా కుమార్ సాయి ప్రతిభ పెద్దగా కనిపించలేదు. అనవసరంగా ఎదుటివాళ్ళపై గొడవలు పడుతున్నాడనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.

అతి తక్కువ ఓట్లు అతనికే..

అతి తక్కువ ఓట్లు అతనికే..

మిగతా వాళ్ళు ఎదో ఒక విధంగా బిగ్ బాస్ కెమెరాలను ఎట్రాక్ట్ చేస్తుండగా కుమార్ సాయి మాత్రం ముచ్చట్లతోనే సరిపెట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ యాంగిల్ లో చాలా ఫెయిల్ అయ్యాడు. కుమార్ సాయి ఈ వారం నామినేట్ చేసిన హౌస్‌మేట్స్‌లో అతి తక్కువ ఓట్లను పొందినట్లు తెలుస్తోంది. మొదట వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇక ఇప్పుడు అది కుమార్ సాయి కూడా బయటకు వెళ్ళడానికి సిద్ధమైనట్లు టాక్.

అతను ఇప్పట్లో వెళ్లిపోయేలా లేడు

అతను ఇప్పట్లో వెళ్లిపోయేలా లేడు

ఇక మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అవినాష్ మాత్రం తన క్రేజ్ ని మరింత పెంచుకుంటున్నారు. ముఖ్యంగా కామెడీ యాంగిల్ లో మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తూ బెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకుంటున్నాడు. కాబట్టి ఇప్పట్లో అతను ఎలిమినెట్ అయ్యే అవకాశం లేదు. ఇక ఇప్పటివరకు కరాటే కళ్యాణి, సూర్య కిరణ్, స్వాతి దీక్షిత్, జోర్దార్ సుజాత, మరియు దేవి నాగవల్లి ఎలిమినెట్ అవ్వగా ఇప్పుడు ఆరవ ఎలిమినేషన్ లో కుమార్ సాయి నిలవనున్నాడు. గంగవ్వా స్వయంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X