బిగ్ బాస్ టైమింగ్స్‌లో మార్పు.. వచ్చే వారం నుంచి అలా ఉండబోతోంది!!
బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంది. ఇకపై ఇంతకుముందులా కోట్లాటలేమీ ఉండవు. టాస్కులు కూడా మరీ అంత చించుకునేలా ఏమీ పెట్టరు. ఇక మిగిలిన ఫినాలే టిక్కెట్ట్ ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. అది ఈ వారం అయిపోతుంది. అయితే షో ముగింపుకు వస్తుండగా.. టైమింగ్స్‌లో మార్పులు చేయడం ఆ చానెల్‌కు అలవాటే. గత సీజన్లలోనూ అంతే చివరి రెండు మూడు వారాల్లో టైం స్లాట్‌ను మార్చేశారు. ఇక చివరకు వచ్చింది గనుక ఎలాగూ ఫాలో అయ్యే వారు అవుతారన్న ధీమాతో మార్చేస్తుంటారు.

కొత్త సీరియల్ రాకతో..
మామూలుగా కొత్త సీరియల్ ఏదైనా వస్తుందంటే పాత వాటి టైమింగ్స్‌లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. అలాగే దేవత సీరియల్ కోసం మౌనరాగం టైమింగ్స్‌ను మార్చేశారు. మౌనరాగం ముందుకు రావడంతో చిట్టితల్లి మరింత వెనక్కి వెళ్లిపోయింది. అలా ఒక్క సీరియల్ కోసం ఎన్నో రకాల మార్పులు జరుగుతుంటాయి. ఎందుకంటే కొత్త సీరియల్‌ను ప్రైమ్ టైంలోనే వేయాలని అందరూ అనుకుంటారు.

మార్పులు జరిగాయి
అందుకే స్టార్ మాలో కొత్తగా రాబోతోన్న ఓ సీరియల్ కోసం టైమింగ్స్ మారిపోయాయి. ఏడుగంటలకు వస్తున్న వదినమ్మ సీరియల్ బాగానే క్లిక్ అయింది. ఏడు ఎనిమిది గంటలు అనేవి ప్రైమ్ టైమ్. ఈ సమయంలో సీరియల్స్ చాలా కీలకమైనవి. అందుకే కొత్తగా రాబోతోన్న గుప్పెడంత మనసు అనే సీరియల్‌ను వదినమ్మ టైంలో వేస్తున్నారు.

వదినమ్మ వల్ల..
అలా వదినమ్మ స్థానంలో గుప్పెడంత మనసు వచ్చే వారం నుంచి ప్రసారం కానుంది. అయితే వదినమ్మ సీరియల్‌ను రాత్రి 9 30 గంటలకు మార్చారు. అంటే అది బిగ్ బాస్ షో ప్రారంభ సమయం. వచ్చే వారం నుంచి వదినమ్మ రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుందని ప్రోమోలు వేస్తున్నారు. అంటే బిగ్ బాస్ షోను రాత్రి పది గంటలకు వేయనున్నారు.
Recommended Video

మరింత ఆలస్యం..
అసలే బిగ్ బాస్ షో వల్ల సిరిసిరిమువ్వలు, ఆమె కథ సీరియళ్లు పత్తా లేకుండా పోయాయి. ప్రతీ రోజూ బిగ్ బాస్ అనంతరం ఆమె కథ సీరియల్ మళ్లీ ప్రసారం అవుతూ ఉంటుంది. అలా వచ్చే వారం నుంచి బిగ్ బాస్ షో పది గంటలకు మొదలు కానుంది. శని, ఆది వారాల్లో మళ్లీ యథాతథంగా ఉండనుంది.


Click it and Unblock the Notifications











