బిగ్‌బాస్ 4 ప్రేమదేశం.. మోనాల్‌కి షాక్ ఇచ్చిన అభిజిత్.. అఖిల్‌కి ఎక్కడో మండింది!
బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం అంతంత మాత్రంగానే నడిచినా సెకండ్ వీక్ మాత్రం ఊహించని మలుపులతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇంకా సరైన గొడవలు మొదలు కాలేదు గాని బిగ్ బాస్ మెల్లగా చిచ్చు పెట్టడానికి ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక షోలో ఈ వారం స్పెషల్ ఎట్రాక్షన్ గా ట్రయాంగిల్ లవ్ స్టొరీనే కొనసాగించేలా ఉన్నారని అనిపిస్తోంది. ఇక నేటి ఎపిసోడ్ లో ప్రేమ దేశం సీన్స్ కనిపించేలా ఉన్నాయని అనిపిస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అయ్యింది.
Recommended Video

ఇప్పట్లో బయటకు వెళ్లేలా లేరు
అభిజిత్, అఖిల్ ఇద్దరు కూడా మోనల్ తో క్లోజ్ అవ్వడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మోనల్ కూడా ఎవరిని దూరం పెట్టలేక సతమతమవుతొంది. ఒక విధంగా ఈ ప్రేమ దేశం కథ రోజుకో మలుపు తిరగడం చూస్తుంటే ఇప్పట్లో ఈ లవ్ బర్డ్స్ హౌజ్ నుంచి బయటకు వెళ్లే అవకాశం లేదని అనిపిస్తోంది. ఇక రీసెంట్ గా ఒక విషయంలో అఖిల్ హార్ట్ అయ్యాడు.

అఖిల్ స్పెషల్ ఫోకస్
సోఫాలో కూర్చొని అభిజిత్, మోనల్ మాట్లాడుకుంటూ ఉంటే అఖిల్ వారిపైనే ఇన్ డైరెక్ట్ గా ఫోకస్ పెడుతున్నాడు. మోనల్ ఒక విధంగా వీరిద్దరి విషయంలో చాలా అప్సెట్ అయినట్లే కనిపిస్తోంది. గత వారమే ఆమె వేరే విషయంలో చాలా ఎమోషనల్ కి గురయ్యింది. అందరిని సంతోషపెట్టడానికి నేనే ఉన్నానా అంటూ ఫైర్ అయ్యింది.

అభిజిత్ షాకింగ్ కౌంటర్..
ఇక ఈ రోజు అభిజిత్ ఒక కౌంటర్ ఇచ్చాడు. నార్మల్ గా మన ఫ్రెండ్ ని మనమే సెలెక్ట్ చేసుకుంటాం. పాట్నర్ ని కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకు ఆ అవకాశం లేదు అంటూ మోనల్ చెప్పడంతో.. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు మీ క్లాస్ మెట్ ని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా అంటూ అభిజిత్ కౌంటర్ ఇచ్చాడు.

అఖిల్ కి ఎక్కడో మండింది
ఆ సమాధానంతో కంగారుగా దగ్గిన మోనల్ కి వాటర్ తేవాలని అనుకున్నాడు అభిజిత్. కానీ పక్కనే ఉన్న అఖిల్ కి బాగానే మండినట్లు అర్థమైంది. వెంటనే అభిజిత్ మోనల్ కి వాటర్ ఇస్తున్నవా అని చెప్పినా కూడా అఖిల్ సమాధానం ఇవ్వలేదు. కానీ మోనల్ కి వాటర్ ఇచ్చేశాడు. ఈ విధంగా వీరి లవ్ స్టొరీ ఈ రోజు ఏపిసోడ్ లో హాట్ టాపిక్ అయ్యేలా ఉందని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











