బిగ్‌బాస్ షో టీఆర్పీ చూస్తే దిమ్మతిరగాల్సిందే.. మూడు సీజన్లను పడగొట్టి సరికొత్త రికార్డ్!!
బిగ్‌బాస్ టీఆర్పీ విషయంలో ముందే అనుకున్నట్టు జరిగింది. అసలే కరోనా సమయం, బయటకు వెళ్లే చాన్స్ లేదు..గత కొన్నేళ్లుగా టీవీలను చూసే వీక్షకుల సంఖ్య పెరిగింది. అందరూ ఇంటి పట్టునే ఉంటూ టీవీలకు అతుక్కుపోయారు. దానికి తోడు బిగ్‌బాస్ వంటి రియాల్టీ షో దుమ్ములేపకుండా ఉంటుందా?ముందు నుంచీ అనుకున్నట్టుగానే ఈ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మొదటి రోజు ప్రారంభ వేడుకులు అనుకోని రీతిలో సక్సెస్ అయింది. దీని కంటే ముందుగా వచ్చిన మూడు సీజన్ల రికార్డులను నాగ్ బద్దలు కొట్టేశాడు.

టీఆర్పీలో కొత్త రికార్డ్..
బిగ్‌బాస్ షోకు సంబంధించిన టీఆర్పీల్లో ఈ నాల్గో సీజన్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కంటెస్టెంట్ల విషయంలో ప్రేక్షకులు కాస్త పెదవి విరిచినా సరే షో పట్ల ఏ మాత్రం ఆసక్తి తగ్గలేదని మరోసారి నిరూపించారు. దీనికి నిదర్శనం టీఆర్పీలే. ఓపెనింగ్ రోజు అదిరిపోయే రికార్డులను కొట్టిన నాగ్‌కు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

అదిరిపోయే టీఆర్పీ..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభ వేడుకలకు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే మొదటి రోజు ఈ రేటింగ్ రావడం ఓ రికార్డ్. గడిచిన మూడు సీజన్లు ఇంతటి రేటింగ్‌ను రాబట్ట లేకపోయాయి. మొదటి సీజన్ కావడం, అందులోనూ ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో 16.18 రేటింగ్ వచ్చింది. ఇక నాని హెస్ట్ చేసిన రెండో సీజన్‌కు 15.05, మూడో సీజన్‌కు 17.9 వచ్చాయి. నాగ్ తన గత రికార్డును తానే బద్దలు కొట్టేశాడు.

వారం మొత్తం టీఆర్పీ ఎంతంటే..
ఓపెనింగ్ వేడుకలకు అంత రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కంటెస్టెంట్లు ఎవరని తెలుసుకునే కుతూహలంతో అందరూ టీవీల ముందు కూర్చుంటారు. అయితే కంటెస్టెంట్లు వీక్‌గా ఉన్నా కూడా.. వారం మొత్తం మంచి టీఆర్పీనే వచ్చింది. మొదటి వారం ఈ షోకు 7.22 టీఆర్పీ వచ్చింది. అయితే ఈ విషయంలో మాత్రం నాల్గో సీజన్ కాస్త వెనుకబడే ఉంది.
Recommended Video

ఆ విషయంలో మొదటి సీజనే టాప్..
బిగ్‌బాస్ షో ఫస్ట్ వీక్ టీఆర్పీల్లో మొదటి సీజన్ టాప్ ప్లేస్‌లో ఉంది. మొదటి సీజన్‌కు ఫస్ట్ వీక్‌లో 10.69, రెండో సీజన్‌కు 3.50, మూడో సీజన్‌కు 4.66 రేటింగ్ అత్యంత దారుణంగా వెనుకబడ్డాయి. కానీ ఈ నాల్గో సీజన్ మాత్రం కొంచెం బెటర్ స్థానంలోనే ఉంది. ఇప్పుడిప్పుడే షో కాస్త పుంజుకుంటోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో షో కాస్త రక్తి కట్టేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











