‘బిగ్‌బాస్’కు షాక్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయింది.. ఇక మొత్తం ప్రశాంతతే!!
బిగ్‌బాస్ షో అంటేనే సస్పెన్స్ తక్కువ.. లీకులు ఎక్కువనట్టు తయారైంది. గత సీజన్లు కూడా లీకుల బారినపడ్డాయి. ఎలిమినేషన్, నామినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, గెస్ట్‌లు ఇలా ప్రతీ ఒక్క విషయం ముందుగానే లీకయ్యేది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సారి కూడా లీకులు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఫస్ట్ వీక్ నామినేషన్‌ను ఎదుర్కొని, గెలవలేక ఇంటి బాట పట్టిందెవరో ముందే లీకైపోయింది.

ఎలిమినేషన్‌లో ఏడుగురు..
బిగ్‌బాస్ మొదటి వారం ఎలిమినేషన్ ప్రాసెస్‌లో భాగంగా మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. గంగవ్వ, దివి, అభిజీత్, సుజాత, మెహబూబ్, అఖిల్, సూర్య కిరణ్ నామినేషన్‌లో పడ్డారు. ఇక ఈ ఏడుగురిలో ముగ్గురు (సుజాత, అభిజీత్, గంగవ్వ) సేవ్ అయినట్టు నాగ్ శనివారం నాటి ఎపిసోడ్‌లో ప్రకటించాడు.

ఉత్కంఠ రేపేందుకు..
ఇక మిగిలిన నలుగురిలో ఎవరు సేవ్ కానున్నారు? ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే ఉత్కంఠను ఆదివారం ఎపిసోడ్ వరకు ఉంచాలని ప్రయత్నించారు. కానీ లీకు వీరుల పుణ్యమా అని ముందే తెలిసిందే. డైరెక్టర్ సూర్య కిరణ్ మొదటి వారం ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఆ అతి వల్లే..
మామూలుగా అయితే మొదటి వారంలో దివి, మెహబూబ్, అఖిల్, సూర్య కిరణ్‌లకే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక దివి చివరి రెండు రోజుల్లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుని సేవ్ అయింది. అఖిల్‌కు మోనాల్ ట్రాక్, గంగవ్వ సపోర్ట్ కలిసి వచ్చింది. ఇక మెహబూబ్, సూర్య కిరణ్‌ల మధ్య చాలా తక్కువ తేడా వచ్చిందని తెలుస్తోంది. అది కూడా సూర్య కిరణ్ అతి వల్ల, అజమాయిషీ చెలాయించడం, అందరినీ డామినేట్ చేయడం, ప్రతీదాంట్లో దూరడమే విషయాలతో ప్రేక్షకులు విసుగుచెందారు.

సూర్య కిరణ్ అవుట్..
అందుకే సూర్య కిరణ్‌ను ఇంటి నుంచి పంపేశారు. ఇప్పటి వరకు చేసిన అతి చాలయ్యా.. ఇక తట్టా బుట్టా సర్దుకుని పో పో అంటూ తీర్పును ఇచ్చారు. ఏ పని చేయకుండా పక్కవారితో చేయించుకుంటూ.. అందులో ఇందులో దూరడంతో సూర్య కిరణ్‌కు దెబ్బ పడింది. ఇకపై సూర్య కిరణ్ లొల్లి ఉండదు కాబట్టి హౌస్ అంతా ప్రశాంతంగా ఉంటుందేమో చూడాలి. ఇక సూర్య కిరణ్ వెళ్లే ముందు కంటెస్టెంట్ల గురించి ఏం చెబుతాడో మరి.


Click it and Unblock the Notifications











