Bigg Boss ఇంటికి తాళం.. అఖిల్‌ను బయటకు పంపిన కంటెస్టెంట్లు
బిగ్ బాస్ షోలో అందరూ కలిసి ఓ కంటెస్టెంట్‌ను నేడు ఇంటి నుంచి బయటకు తోలేందుకు రెడీ అయ్యారు. అయితే వారికి తెలియదు అది సీక్రెట్ రూంలోకి అని. కానీ బయట చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు. ఇది కాసేపు పక్కన పెడదాం. ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఓ పేరు చెప్పాలని, ఎవరైతే స్ట్రాంగ్ అని ఫీలవుతారో.. ఎవరు ఇంట్లో ఉండొద్దని భావిస్తారో ఓ పేరు చెప్పమని బిగ్ బాస్ కోరాడు.
ఇక తొమ్మిది మందిలో ఎవరు వెళ్తారు.. ఎవరు వెళ్లాలి ఎలాంటి కారణాలు చెప్పాలని అందరూ తెగ ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. ప్రతీ విషయంలో స్ట్రాంగ్ అని చెప్పుకునే అరియానా, అవినాష్, మెహబూల్‌లు ఈ సారి కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అఖిల్‌ను పంపించాలని సోహెల్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని అభిజిత్ వ్యతిరేకించినట్టు కనిపిస్తోంది. అయితే బిగ్ బాస్ ఇంటికి తాళం వేస్తున్నట్టు తెలిపాడు. ఎవరో ఒకరిని బయటకు పంపించాకే తాళం తీస్తానని హెచ్చరించినట్టు కనిపిస్తోంది.

ఎవరో ఒకరి పేరు చెప్పమని బిగ్ బాస్ అడగడంతో తన పేరు తాను చెప్పుకున్నాడు అభిజిత్. అది బిగ్ బాస్ లెక్కలోనికి తీసుకోనట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయానికి రావడానికి చాలానే కష్టపడినట్టు కనిపిస్తోంది. అయితే అందరూ కలిసి అఖిల్‌ను బయటకు పంపిచారు. అది వారి దృష్టిలో మాత్రమే. సీక్రెట్ రూంలోకి వెళ్లిన అఖిల్ బయటకు వచ్చాక ఎలా మారుతాడో చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్‌కు రానున్న రోజుల్లో మిగతా కంటెస్టెంట్లు షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











