అరియానా గుట్టు బయటపడింది.. ఆ విషయం అసలు సీక్రెట్ కానేకాదు!!
బిగ్ బాస్ షోలో మాట్లాడే ప్రతీది రికార్డ్ అవుతుంది.. ఏదైనా తప్పు మాట్లాడితే దొరికి పోతామన్న భయం కంటెస్టెంట్లలో ఉంటుంది. అందుకే ఏది చెప్పినా దాదాపు నిజమే చెబుతుంటారు. అయితే నిన్నటి టాస్క్‌లో అరియానా మాత్రం ఘోరమైన తప్పిదం చేసింది. ఎవ్వరితోనూ పంచుకోని సీక్రెట్ చెప్పాలని బిగ్ బాస్ టాస్క్ ఇస్తే అరియానా ఏదో విషయాన్ని చెప్పింది. అది కూడా గతంలో ఇంటర్వ్యూలో ఎప్పుడో ఆ విషయాన్ని కూడా చెప్పింది.

నిన్నటి టాస్క్..
బిగ్ బాస్ తన కంటెస్టెంట్లకు నిన్న ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఫ్యామిలీ మెంబర్స్ పంపిన ఉత్తరాలను కంటెస్టెంట్లకు ఇచ్చేందుకు ఓ టాస్క్ పెట్టాడు. బిగ్ బాస్ ఇంట్లో ఏదైనా మంచి పొందాలంటే తగిన మూల్యం చెల్లించాలని తెలిపాడు. అందులో భాగంగా ఇంత వరకు ఎవ్వరితోనూ షేర్ చేసుకుని రహస్యాలను చెప్పాల్సి ఉంటుందని తెలిపాడు.

అరియానా అలా..
ఇంటి సభ్యులందరూ తమకు వచ్చిన ఉత్తరాలను చేజిక్కించుకునేందుకు రహస్యాలు చెప్పారు. హారిక తన ప్రేమ వ్యవహారం, మెహబూబ్ తన రెండు రోజుల జైలు జీవితం, సోహెల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు గురించి చెప్పాడు. ఇలా పలు రకాల సీక్రెట్లను బయటపెట్టారు. వారు చెప్పిన రహస్యాలకు అఖిల్ సంతృప్తి చెంది లెటర్‌లను పంపించాడు. కానీ అరియానా చెప్పింది అసలు సీక్రెట్ కాదని ఏటో వెళ్లిపోయిందని అఖిల్ చెప్పుకొచ్చాడు.

ప్రమాదం గురించి..
తాను, తనతో పాటు నలుగురు చనిపోయి ఈ పాటికి ఏడాది అయ్యేదని చెప్పుకొచ్చింది. ఓ సారి అర్దరాత్రి కారులో ప్రయాణం చేశాము. ఆ సమయంలో కారుకు ఘోరమైన ప్రమాదం జరిగింది. కరెంట్ పోల్ మా కారుపైపడి ఉంది.. చుట్టూ మంటలు వచ్చాయి.. కారు నుజ్జునుజ్జు అయిందని చెప్పింది. అయితే ఇంత చెప్పినా కూడా అఖిల్ మాత్రం అది సీక్రెట్ కాదని చెప్పి ఆ లెటర్‌ను ముక్కముక్కలు చేసి పంపించాడు.

గతంలోనే చెప్పేసింది..
అయితే ఈ ప్రమాదం గురించి గతంలోనే ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అప్పుడు చెప్పిన విధానం, కన్‌ఫెషన్ రూంలో చెప్పిన విధానంలో ఎంతో తేడా ఉందని, అరియానా అతియానాలా మారిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సీక్రెట్ చెప్పమంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన చెబుతోంది.. బుర్ర అసలు ఉందా అని కౌంటర్లు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











