ఇండస్ట్రీలో డబ్బుల విషయంలో మోసపోయాను.. అవినాష్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షోలో అవినాష్ మొదట్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా జోష్‌తో ఉన్నాడో.. ఇప్పుడు అది కనిపించడం లేదు. నామినేషన్స్ అంటేనే భయపడుతున్నాడు. బిగ్ బాస్ షోలోంచి ఎలిమినేట్ అయితే ఇక జీవితమే లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీసారి జబర్దస్త్ షో మీద నెగెటివ్ ఇమేజ్ ఏర్పడేలా కామెంట్లు చేయడం, ప్రతీసారి తన బాధల గురించి చెబుతూ ప్రేక్షకులను బోర్ కొట్టిస్తున్నాడు.
నవ్వించేందుకు బిగ్ బాస్ పంపించాడు.. నవ్వించేందుకు వచ్చా అంటూ చెప్పిన అవినాష్ ఇప్పుడు తానే నవ్వడం మరిచిపోయాడు. ఎవరొచ్చి నామినేషన్‌లో వేస్తారా? అని భయపడుతున్నాడు. ఇంట్లో అవినాష్‌కు ఉన్న ఏకైక దిక్కు అరియానానే. అరియానాకు కూడా అవినాష్ తప్ప వేరే దిక్కు లేదు. ఒకరికొకరు అన్నట్టు తయారైంది వ్యవహారం. అదంతా కాసేపు పక్కనపెడదాం. నేటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులందరికీ ఉత్తరాలు వచ్చాయి.

అవి కంటెస్టెంట్ల చెంతకు చేరాలంటే ఓ టాస్క్‌ను పూర్తి చేయాలని తెలిపాడు. ఎవ్వరితోనూ పంచుకోని ఓ సీక్రెట్‌ను పంచుకోవాలని తెలిపాడు. అది విన్న అఖిల్.. తాను సంతృప్తి చెందితే.. సీక్రెట్ రూం నుంచి ఆ లెటర్‌ను ఇంటి సభ్యులకు పంపిస్తాడు. ఆ క్రమంలో అవినాష్ తన జీవితంలో జరిగిన సంఘటనను బయట పెట్టినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో డబ్బుల విషయంలో మోసపోయానని అవినాష్ ఏదో విషయాన్ని బయటపెట్టేశాడు. అదేంటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.ఎదురుచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











