Bigg Boss Unseen మటన్ కోసం చిత్రహింసలు.. స్విమ్మింగ్ పూల్‌లో అర్దనగ్నంగా అవినాష్
బిగ్ బాస్ ఇంటి సభ్యులకు నాన్ వెజ్ అంటే ఆరోజు పండుగే. బిగ్ బాస్ కొన్ని స్పెషల్ టాస్కులు పెట్టి మటన్, చికెన్ వంటివి పంపిస్తుంటాడు. లేదా లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఇంటి సభ్యులు నాన్ వెజ్ ఐటెమ్స్ సెలెక్ట్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ నాల్గో సీజన్‌లో మటన్ అనే పడిచచ్చే కంటెస్టెంట్లు చాలా మందే ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా మెహబూబ్ ముందు వరుసలో ఉంటాడు. ఆ తరువాత సోహెల్, హారిక ఇలా అందరికీ మటన్ అంటే ఎక్కువ ఇష్టం.

రేషన్ మేనేజర్..
పదో వారానికి గానూ రేషన్ మేనేజర్‌గా ఉన్న అవినాష్ మటన్ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. అవినాష్ వల్ల మటన్ పాడైపోయింది. మటన్‌ను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టకపోవడంతో కేజీ మటన్ వ్యర్థమైంది. దీనిపై ఇంటి సభ్యులందరూ అవినాష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెహబూబ్, సోహెల్..
మరీ ముఖ్యంగా మెహబూబ్, సోహెల్‌లు నిరుత్సాహ పడ్డారు. మటన్ వండుతారు కదా అని ఎక్కువగా వ్యాయామం కూడా చేశారట. మా ఆశలపై నీళ్లు చల్లావ్ నీ వల్లే ఇదంతా జరిగిందని అవినాష్ తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేశారు. అంతటితో వదల్లేదు.

అర్దనగ్నంగా ఉంచేశారు..
స్విమ్మింగ్ పూల్‌లోంచి బయటకు రానివ్వలేదు. అలాగే అర్ధనగ్నంగా ఉంచేశారు. అవినాష్‌కు సంబంధించిన పర్ఫ్యూమ్ బాటిల్స్‌ను స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తామని బెదిరించారు. మటన్ వచ్చే వరకు నీ ఎగ్స్ మొత్తం తీసుకుంటామని బెదిరించారు. రాత్రి వరకు కేజీ మటన్ తెప్పిస్తానని మాటిచ్చాడు.

లాస్యకు బాధ్యతలు..
రేషన్ మేనేజర్‌గా అవినాష్ విఫలమయ్యాడని తదుపరి బాధ్యతలను లాస్యకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. రేషన్ మేనేజర్ రూం తాళం ఎవరి దగ్గర ఉందని హారిక అడిగింది. అవినాష్‌ను అరియానా, మెహబూబ్,సోహెల్, హారికలు చితకబాదారు. మొత్తానికి మటన్ మాత్రం అవినాష్ నామినేషన్‌కు కారణమయ్యేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











