బిగ్ బాస్ ఇంట్లో నవ్వులు నిషేధం.. కారణం అదే
బిగ్ బాస్ ఇంట్లో నేటి ఎపిసోడ్‌లో ఓ వింత టాస్క్ఇవ్వబోతోన్నట్టు తెలుస్తోంది. ఇంట్లో నవ్వులు నిషేధం అని ప్రకటించాడు. అయితే దానికి కూడా ఓ ప్రత్యక కారణం ఉంది. నిన్నటి ఎపిసోడ్‌లో కుటుంబ సభ్యులు రాసిన ఉత్తరాలను చేజిక్కించుకోవాలంటే ఓ టాస్క్ చేయాలని తెలిపాడు. ఎవ్వరితో షేర్ చేసుకోని, ఎవ్వరికీ తెలియన సీక్రెట్‌లను బిగ్ బాస్‌కు చెప్పాల్సి ఉంటుందన్నాడు. అలా మూల్యం చెల్లించుకుంటేనే ఉత్తరాలు వస్తాయని తెలిపాడు.
అలా కంటెస్టెంట్లు తమ జీవితంలోని రహస్యాలను పంచుకున్నారు. వాటికి సంతృప్తి చెందిన అఖిల్ సీక్రెట్ రూం నుంచి ఆ ఉత్తరాలను పంపించాడు. అందులో అరియానా, అవినాష్‌లు చెప్పిన విషయాలు అంత ప్రభావవంతంగా లేకపోవడంతో వారి ఉత్తరాలను ముక్కముక్కలుగా చేసేశాడు. అలా నేటి ఎపిసోడ్‌లోనూ కంటెస్టెంట్లకు వారి ఫ్యామిలీ నుంచి దీపావళి బహుమతులు వచ్చాయి. వాటిని గెలుచుకోవాలంటే నవ్వకూడదనే టాస్క్ పెట్టాడు.

బిగ్ బాస్ ఇంట్లో నవ్వు నిషేధం ఎవరైతే నవ్వకుండా ఉంటారో వారికి బహుమతులు లభిస్తాయన్నాడు. అయితే నవ్వించే పనిని కూడా కంటెస్టెంట్లకు అప్పగించినట్టు కనిపిస్తోంది. సోహెల్, అవినాష్, అభిజత్ వంటి వారు మిగతా ఇంటి సభ్యులను నవ్వించేందుకు ప్రయత్నం చేశారు. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో దీపావళి సెలెబ్రేషన్స్ జరగబోతోన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











