బిగ్ బాస్ ప్లాన్ అదేనా?.. అందు కోసమే సీక్రెట్ రూంలోకి అఖిల్!
బిగ్ బాస్ షోలో ఆట ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ తాను ఆనుకున్నట్టుగా కంటెస్టెంట్లను ఓ ఆట ఆడిస్తాడు. అందులో ఒకటి సీక్రెట్ రూం. ఇంట్లో నుంచి మనిషిని బయటకు పంపించినట్టు చెబుతారు. కానీ ఆ మనిషి మాత్రం అక్కడే ఓ సీక్రెట్ రూంలో ఉంటాడు. మిగతా కంటెస్టెంట్లు మాట్లాడుకునే మాటలన్నీ వింటాడు. ఎవరు ఎలాంటి వారన్నది సదరు కంటెస్టెంట్ తెలుకుంటాడు. గొడవలు మొదలవుతాయి. ఆట మలుపు తిరుగుతంది. అలాంటి ఓ ప్లానే తాజాగా వేసినట్టు కనిపిస్తోంది.

పదో వారంలో అలా..
పదో వారం నామినేషన్ ప్రక్రియ మంచి రసవత్తరంగా సాగింది. షుగర్ బాటిల్స్ ప్రతీ ఒక్కరి నెత్తి మీద పగిలాయి. అయితే అందరికంటే ఎక్కువగా అరియానా నెత్తి మీదే పగిలాయి. అవినాష్ తప్పా ఇంట్లో ఉన్న మిగిలిన ఇంటి సభ్యులందరూ అరియానాను నామినేట్ చేశారు. మొత్తంగా ఆమెను ఏడుగురు నామినేట్ చేశారు. ఈ పదో వారంలో అభిజిత్, హారిక, సోహెల్, అరియానా, మెహబూబ్, మోనాల్‌లు నామినేట్ అయ్యారు.

కెప్టెన్సీ టాస్క్..
నేటి ఎపిసోడ్‌లొ ఇంటి సభ్యులందరి చేత కెప్టెన్సీ టాస్క్ ఆడించేలా కనిపిస్తున్నారు. బాస్కెట్ బాల్ ఆటలో ఏదో ట్విస్ట్ పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఈ టాస్క్ ఫలితం మాత్రం ఘోరంగా వచ్చినట్టు కనిపిస్తోంది. పదోవారం కెప్టెన్సీలో ఎవ్వరూ కూడా విన్ అవ్వలేదని తెలుస్తోంది.

అఖిల్ సీక్రెట్ రూంలోకి..
అయితే ఈ వారంలో బిగ్ బాస్ ఓ టాస్క్ఇవ్వబోతోన్నాడని టాక్. ఈ మేరకు లీకులు కూడా బయటకు వచ్చేశాయి. అఖిల్‌ను బిగ్ బాస్ సీక్రెట్ రూంలోకి పంపించబోతోన్నాడని తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్క్‌లో ఏదో తేడా కొట్టి ఉంటుందని, అందుకే అఖిల్‌ను రాత్రికి రాత్రే సీక్రెట్ రూంలోకి పంపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో ఏదో పెద్ద తిరకాసున్నట్టు తెలుస్తోంది.

గతంలోనూ అలానే..
గత సీజన్‌లోనూ అంతే రాత్రికి రాత్రే పునర్నవి, అలీరెజా ఇద్దర్నీ సీక్రెట్ రూంలోకి పంపించారు. అదీ కాకుండా రాహుల్ విషయంలో మరీ దారుణం.. ఎలిమినేషన్ అని నమ్మించి.. సీక్రెట్ రూంలో పెట్టేశారు. మళ్లీ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చాక సమీకరణాలు మారిపోయాయి. రాహుల్ వితిక-శ్రీముఖి మాటలు విని హర్ట్ అయ్యాడు. అలీరెజా, శివజ్యోతిలతో క్లోజ్ అయ్యాడు.

ఆట తీరు మారుతుందేమో..
అలా సీక్రెట్ రూంలో ఉండి వచ్చాక..ఇంటిసభ్యులందరి విషయాలు, మాట్లాడుకునే మాటలు, వారి ప్రవర్తన ఇలా అన్నీ కూడా సీక్రెట్ రూంలో ఉన్న వారికి తెలుస్తాయి. అలా అఖిల్ కూడా అందరి నిజ స్వరూపాలు తెలుసుకుని ఆట తీరును మార్చేస్తాడేమో చూడాలి. మొత్తానికి అఖిల్‌కు మంచి చాన్స్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











