నా దరిద్రం ఎలా ఉందంటే.. మళ్లీ మెహబూబ్‌కు ఆ ఛాన్స్ మిస్!
బిగ్ బాస్ షోలో మెహబూబ్‌కు మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి జారిపోతుంటాయి. కెప్టెన్ అవ్వాలనే కోరిక అలాగే మిగిలిపోయేలా ఉంది. కాయిన్స్ టాస్క్‌లో చేతికి వచ్చిన అదృష్టాన్ని కాలితో తన్నినట్టైంది. బీబీ హోటల్ టాస్క్‌లో సోహెల్ కోసం వదులుకున్నాడు. ఇలా ప్రతీ సారి ఏదో ఒక రూపంలో తన అదృష్టాన్ని దురదృష్టం వెనక్కి లాగేస్తోంది. ఇలా మెహబూబ్ తన గురించి అనుకుంటున్నాడు.
కానీ అసలు విషయం అది కాదు. మెహబూబ్‌ను బిగ్ బాస్ టీం కావాలనే సేవ్ చేస్తోందని, అందుకే మెహబూబ్‌కు తక్కువ ఓట్లు వచ్చినా కూడా దేవీ నాగవల్లిని ఎలిమినేట్ చేసి బయటకు పంపారని సోషల్ మీడియా మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ అలానే మెహబూబ్‌ను కాపాడేందుకు కెప్టెన్ అయిన సోహెల్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చాడు. మెహబూబ్ సేవ్ అయ్యేలా చేశాడు.

ఇలా అన్నిసార్లు అదృష్టం దొరికిన మెహబూబ్ మాత్రం ఇంకా ఫీలవుతూనే ఉన్నాడు. టాస్కులో ఎంత బాగా ఆడినా, కెప్టెన్ అవ్వలేకపోతున్నానే బాధలో మెహబూబ్ ఉన్నట్టు కనిపిస్తోంది. నేటి కెప్టెన్సీ టాస్క్‌లో మళ్లీ ఈ ముగ్గురి మధ్య గొడవలు జరగబోతోన్నట్టు కనిపిస్తోంది. నా దరిద్రం ఎలా ఉందంటే.. నా చేతికి ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ దేవుడు లాగేసుకుంటున్నాడని మెహబూబ్ వాపోయాడు. అసలు నేటి టాస్క్‌లో ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











