Don't Miss!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కంటెస్టెంట్లకు ఉత్తరాలు.. అభిజిత్‌పై అఖిల్ అక్కసు పెంచుకున్నాడా?
బిగ్ బాస్ షోలో పదో వారం కంటెస్టెంట్లకు కొన్ని షాకులు ఇచ్చాడు. కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేసి ఆశలపై నీళ్లుచల్లాడు. మళ్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ పేరిట అఖిల్‌ను బయటకు పంపించాడు. కంటెస్టెంట్ల దృష్టిలో అది ఎలిమినేషన్. కానీ అది సీక్రెట్ టాస్క్ సీక్రెట్ రూం అని ప్రేక్షకులకు తెలుసు. అయితే ఆ విషయం కంటెస్టెంట్లకు కూడా తెలుసు. కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఫలితం శూన్యం..
పదో వారం కెప్టెన్సీ టాస్క్‌లో బాస్కెట్ బాల్ అడించాడు బిగ్ బాస్. ఆ బాల్స్ మీద కంటెస్టెంట్ల బొమ్మలుంటాయని, ఎవరిది వారు కాకుండా వేరే కంటెస్టెంట్ బొమ్మ ఉన్న బాల్‌ను సెలెక్ట్ చేయాలని, చివరగా ఏ కంటెస్టెంట్ బొమ్మఉన్న బాల్ బాస్కెట్లో పడుతుందో వారు ఆట నుంచి తప్పుకుంటారని తెలిపాడు. ఆ ఆటలో చివరకు మెహబూబ్, అఖిల్ మిగిలారు. వారిద్దరూ మొండిపట్టు పట్టి ఎవరి బొమ్మ ఉన్న బాల్స్‌ను వారే పట్టుకున్నారు. దాంతో ఆగ్రహించిన బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేశాడు.
స్ల్రాంగ్ కంటెస్టెంట్..
మీ ప్రయాణంలో మీకు అడ్డు వచ్చే కంటెస్టెంట్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరని భావిస్తారో వారి పేరును ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్ బాస్ తెలిపాడు. చాలా సమయం చర్చించుకున్న తరువాత అందరూ కలిసి అఖిల్ పేరు చెప్పారు. దాంతో అఖిల్ ఇంటి నుంచి బయటకు వచ్చి సీక్రెట్ రూంలోకి ఎంట్రీఇచ్చాడు. అఖిల్ ఎలిమినేట్ అయిపోయాడని అందరూ భ్రమల్లో ఉన్నారు.
నేడు ఉత్తరాలు..
సీక్రెట్ రూంలో నుంచి అందరి మాటలు వింటున్నాడు అఖిల్. మరీ ముఖ్యంగా అభిజిత్ మాట్లాడుకునే మాటలనే వినిపించారు. అభిజిత్ లాస్య, అభిజిత్ హారిక మాట్లాడుకునే మాటలు అఖిల్ వింటూ వచ్చాడు. ఈ మధ్యే ఈ ఇద్దరు కాస్తస్నేహంగా ఉన్నారు. కానీ ఈ సీక్రెట్ రూం వల్ల ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగే చాన్స్ ఉంది. అందుకే ఈ ఉత్తరాల విషయంలో అభిజిత్‌కు అఖిల్ పక్షపాతం చూపించినట్టు కనిపిస్తోంది.
Recommended Video
సీక్రెట్ చెప్పాలి..
ఇంతవరకు ఎవ్వరికీ తెలియన విషయాన్ని ఓ సీక్రెట్‌ను పంచుకోవాలని కంటెస్టెంట్లకు ఓ కండీషన్ పెట్టాడు. అలా అయితేనే లెటర్స్ మీ వద్దకు వస్తాయని తెలిపాడు. వారు చెప్పే ఆ సీక్రెట్స్ నచ్చితే అఖిల్ ఆ లెటర్స్‌ను కంటెస్టెంట్లకు పంపుతున్నాడు. నచ్చని వారి లెటర్స్‌ను ముక్కలు ముక్కలు చేసి పంపుతున్నాడు. అందులో అభిజిత్‌కు వచ్చిన లెటర్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అభిజిత్‌పై అఖిల్ అక్కసు పెంచుకున్నాడా? అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడాలి.