అఖిలే నెంబర్ వన్.. ఛాంపియన్.. మెహబూబ్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ ఇంట్లో ఉంటే కంటెస్టెంట్లకు నామినేషన్స్, ఎలిమినేషన్స్ రెండూ కీలకంగా మారుతాయి. నామినేషన్స్ చేస్తారు.. చేయాలని చెబుతారు.. అది చేయాల్సిందే. తప్పదు. అయితే ఎలిమినేషన్ సమయానికి వచ్చే సరికి అందరూ ఎమోషనల్ అవుతారు. తమతో కలిసి ఉన్న సభ్యుడు ఇంటిని విడిచి వెళ్లిపోతున్నాడంటే మిగతా వారంతా ఎమోషనల్ అవ్వడం సహజం. కానీ నిన్నటి మెహబూబ్ ఎలిమినేషన్ ఘట్టం మాత్రం పాతాళగంగను తలిపించింది.

అందరికీ సలహాలు, సూచనలు..
ఎలిమినేట్ అయిన మెహబూబ్ అందరికీ సలహాలు, సూచనలుఇచ్చాడు. ఇక వేరే టాస్క్ ఎందుకు, నెగెటివ్ విషయాలు చెప్పించడం ఎందుకని అనుకున్నారో ఏమో గానీ స్టేజ్ మీద మెహబూబ్‌కు ఎలాంటి టాస్కులు ఇవ్వలేదు. వరుసగా అందరికీ తాను చెప్పాలనుకున్నది చెప్పొచ్చని నాగార్జున తెలిపాడు. అలా అందరికీ తాను ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పాడు. అందరి గురించి పాజిటివ్‌గానే చెప్పాడు.

ఆ ముగ్గురు జట్టుగా..
అఖిల్ సోహెల్ మెహబూబ్ ఎంత క్లోజ్‌గా ఉండేవారో అందరికీ తెలిసిందే. టాస్కుల్లో మళ్లీ ఒకరిపై ఒకరు విరుచుకపడేవారు. టాస్కుల్లో ఎంత గొడవపడ్డా కూడా మళ్లీ చివరకు ఒక్కటయ్యేవారు. అలాంటి గ్రూపులోంచి మెహబూబ్ వేరు అవ్వడంతో ఎమోషనల్ అయ్యారు. గుక్కపట్టుకుని ఏడ్చేశారు.

అఖిలే నెంబర్ వన్..
అయితే స్టేజ్ మీద నుంచి మెహబూబ్ మాట్లాడుతూ.. అఖిల్‌కు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. అఖిలే నెంబర్ వన్.. ఛాంపియన్ అంటూ ఎంకరేజ్ చేశాడు. ఫైనల్ వరకు ఉండాలని చెప్పాడు. ఉంటావని నమ్మకంగా అన్నాడు. ఫైనల్‌లో సోహెల్, అఖిల్ ఉండాలని ఎంతో బలంగా కోరుకున్నాడు. కానీ మెహబూబ్ ఎలిమినేషన్‌తో కన్నీరు పెట్టుకున్న అఖిల్‌కు అసలు నోట మాటే రాలేదు.

మెహబూబ్ అఖిల్ రిలేషన్ అలా..
మొదటి నుంచి మెహబూబ్ అఖిల్ మధ్య కాస్త తక్కువ బంధమున్నట్టు కనిపించేది. కాయిన్స్ టాస్క్‌లో మెహబూబ్‌కు అఖిల్ సపోర్ట్ చేశాడు. కానీ మొన్నటి బాస్కెట్ బాల్ కెప్టెన్సీ టాస్క్‌లో ఇద్దరూ మంకు పట్టు వీడలేదు. అక్కడ ఇద్దరి మధ్యకాస్త దూరం ఏర్పడినట్టు అనిపించింది. అఖిల్ బయటకు వెళ్లడం, సీక్రెట్ రూం నుంచి ఇంట్లోకి రావడం, శత్రువుగా మెహబూబ్‌ను పేర్కొనడం అంతా తెలిసిందే.


Click it and Unblock the Notifications











