ఇంకోసారి ఆంటీలు, ఫిగర్లు అన్నావంటే.. అవినాష్‌కు వార్నింగ్.. ఆడవాళ్లకే నాగ్ సపోర్ట్!
టాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోలంటే అక్కినేని వారే అని నిస్సందేహంగా చెబుతుంటారు. అందులో మరీ ముఖ్యంగా నాగార్జునకు తన సినిమా టైటిల్స్ కరెక్ట్‌గా సరిపోతాయి.. కింగ్ అన్నా మన్మథుడు అన్నా గ్రీకువీరుడు అన్నా ఇలా నాగార్జున ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా నాగార్జున లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. నిత్య యవ్వనంగా మెరిసిపోయే నాగార్జున అంటే ఇప్పటికే అందరూ పడి చచ్చిపోతుంటారు. తాను ఎప్పటికి ఆడవాళ్ల పక్షమే, వారికే సపోర్ట్ చేస్తానని మరోసారి చెప్పాడు.

అందరినీ ఆటాడించాడు..
నాగార్జున సండే రోజు అంతా ఫండేగా మార్చుతాడన్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్లందరినీ ఆటలు ఆడిస్తూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఈ సండే కూడా నాగ్ అందర్నీ ఆలరించేందుకు వచ్చాడు. ఈ ఆదివారం ఇంటి సభ్యులతో వెరైటీ టాస్కులు ఆడిపించినట్టున్నాడు.

గార్డెన్ ఏరియాలో..
గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యులందరినీ వెరైటీ ఆట ఆడించినట్టున్నాడు. ఇందులో భాగాంగా కొందరు గ్రద్దల్లా మారారు. ఇంకొందరు చిన్న చిన్న పక్షుల్లా మారినట్టున్నారు. గ్రద్దలు పక్షులను వేటాడినట్టు చూపిస్తున్నాడు. మొత్తానికి ఈ టాస్క్‌లో అందరూ కలిసి అవినాష్‌ను ఆడుకున్నట్టు కనిపిస్తోంది.

లివింగ్ ఏరియాలో..
ఇక లివింగ్ ఏరియాలో మరో టాస్క్ పెట్టినట్టున్నాడు. ఇందులో అవినాష్ రెచ్చిపోయినట్టున్నాడు. అందమైన భామలు అనే పాటకు డ్యాన్స్ చేశాడు. అందమైన భామలున్నారు కదా తీసుకో అని నాగార్జున అడగడంతో మోనాల్, హారిక, అరియానాలతో కలిసి డ్యాన్స్ చేశాడు.
Recommended Video

లాస్యను మాత్రం..
అందమైన భామలు అంటే ఆ ముగ్గురిని పిలిచావ్.. లాస్యను ఎందుకు పిలవలేదన్నట్టుగా చిచ్చు పెట్టాడు. మళ్లీ ఆంటీ అనే టాపిక్‌ను తీసుకొచ్చాడు. ఇంట్లో ఇంకోసారి ఆంటీలు, ఫిగర్లు అంటూ తిరిగావనుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అందరూ కలిసి అవినాష్‌ను కుమ్మేసే ప్రయత్నం చేయగా.. ఓ మగాడికి అన్యాయం జరుగుతూ ఉంటే సాగి మగాడిగా సాయం చేయండి సర్ అంటూ నాగార్జునను అవినాస్ వేడుకున్నాడు. కానీ తన సపోర్ట్ ఎప్పుడూ ఆడవాళ్లకే ఉంటుందని తనలోని మన్మథుడిని నాగార్జున బయటకు తీసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











