యే అల్లా.. నీయవ్వ ఏంది ఈ ఏమోషన్స్.. ఎలిమినేషన్‌పై భోరుమన్న సోహెల్
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో గ్రూపులు బాగానే ఏర్పడ్డాయి. అయితే అందరూ మంచిగా జంటలు ఏర్పర్చుకున్నారు. అఖిల్ మోనాల్, హారిక అభిజిత్, అమ్మ రాజశేఖర్ దివి, అరియానా అవినాష్ ఇలా అందరూ జట్టుగా ఉండేవారు. కానీ మెహబూబ్ సోహెల్ మాత్రం ఇంట్లో ఓ జట్టుగా ఉండేవారు. ఒకానొక సందర్భంలో ఈ విషయాన్ని మెహబూబ్ కూడా ప్రస్థావించాడు. అందరూ మంచిగా ఇద్దరిద్దరూ ఉన్నారు.. మనం మాత్రం ఇలా మిగిలిపోయామని ఆ మధ్య ఓసారి అన్నాడు. కానీ చివరకు ఈ ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. పదో వారంలో మెహబూబ్ ఎలిమినేషన్‌తో ఇంట్లో సోహెల్ ఒంటరి వాడయ్యాడు.
Recommended Video

టాస్కుల్లో అలా..
ఎంత స్నేహితులైనా సరే టాస్కుల విషయానికి వచ్చే సరికి వారి పాత్రలకు న్యాయం చేసేవారు. టాస్కులో గొడవలు పడ్డా కూడా వెంటనే మళ్లీ ఒక్కటయ్యే వారు. ఇక కలిసి ఆడాల్సిన టాస్కుల్లో అయితే దుమ్ములేపేవారు. ఈ ఇద్దరి కాంబోలో టాస్కులు బాగానే క్లిక్అయ్యాయి.

అతి సన్నిహితంగా..
ఇంట్లో ఈ ఇద్దరే అత్యంత సన్నిహితంగా మెలిగింది. అఖిల్ మోనాల్‌తో బిజీగా ఉంటాడు. కానీ సోహెల్ మెహబూబ్ మాత్రం ఎక్కువగా టైం గడిపేవారు. ఎవరికి ఎమోషనల్ వచ్చినా పంచుకునే వారు. కష్టసుఖాలు మాట్లాడుకునే వారు. అలా ఈ ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు.

చివరకు ఇద్దరు..
నామినేషన్ ప్రక్రియలో చివరకు సోహెల్ మెహబూబ్ ఇద్దరే మిగిలారు. ఇద్దరిలో ఎవ్వరూ ఎలిమినేట్ అయినా బాధపడతాం అని మెహబూబ్ అన్నాడు. గెలవాలనే ఇక్కడే వచ్చాను.. నిజాయితీగానే ఉన్నాను చివరకు ఏమవుతుందో అని సోహెల్అన్నాడు. అయితే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసిన వెంటనే సోహెల్ షాక్ అయ్యాడు. ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలా ఎలిమినేట్ అవుతాడంటూ ఆశ్చర్యపోయాడు. యే అల్లా అంటూ సోహెల్ చిన్న పిల్లాడిలా ఏడుస్తూనే ఉన్నాడు.

స్టేజ్ మీద నుంచి..
మెహబూబ్ ఎలిమినేషన్‌ను తట్టుకోలేక సోహెల్ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంట్లో సోహెల్ భోరున ఏడుస్తుండగా.. మెహబూబ్ బయట స్టేజ్ మీద నుంచి ఏడుస్తున్నాడు. గత సీజన్లు చూస్తున్నప్పుడు ఎలిమినేషన్‌కు ఇంత ఏడుస్తున్నారు.. ఏంట్రా వీళ్ల ఓవర్ యాక్షన్ అనుకున్నా.. కానీ ఆ బాధ ఇక్కడ ఉంటేనే తెలుస్తుంది.. నీ యవ్వ ఏంది ఈ ఎమోషన్స్.. ఇక్కడ మైండ్, మనసుతో ఫైట్ చేయాల్సి వస్తోందంటూ బిక్కుబిక్కుమని ఏడ్చేశాడు.


Click it and Unblock the Notifications











