ఏంట్రా వీళ్ల ఓవర్ యాక్షన్ అని అనుకునేవాడ్ని.. మెహబూబ్ ఎలిమినేషన్‌పై సోహెల్ ఎమోషనల్
బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లు ఒక్కోసారి కంట్రోల్ తప్పుతుంటారు. తమకు ఇష్టమైన వాళ్లు వెళ్లిపోతుంటే ఎమోషన్స్ బద్దలై కన్నీరు కట్టలు తెంచుకుంటుంది. ఇక వారిని ఆపడం ఎవ్వరి సాధ్యం కాదు. గత సీజన్‌లో శివ జ్యోతి గురించి చెప్పుకోవాలి. తనకు ఇష్టమైన వాళ్లు ఎలిమినేట్ అయి వెళ్తుంటే.. ఘోరంగా, మరీ దారుణంగా ఏడ్చేది. చావు ఇంట్లో వచ్చే ఏడ్పుల్లా వాతావరణాన్ని మార్చేది. అయితే ఆ ఇంట్లో, ఆ పరిస్థితులో ఉన్నవారికే దాని బాధ తెలుస్తుంది. అదే విషయాన్ని ఇప్పుడు సోహెల్ చెప్పుకొచ్చాడు.

పదోవారంలో ఎలిమినేషన్..
పదో వారం నామినేషన్స్ ప్రక్రియనే వింతగా జరిగాయి. షుగర్ బాటిల్స్ నెత్తి మీద పగలగొట్టి నామినేట్ చేసేశారు. ఇందులో పదోవారానికి గానూ అభిజిత్, హారిక, అరియానా, సోహెల్, మెహబూబ్, మోనాల్ నామినేట్ అయ్యారు. అయితే ఇందులో శనివారం నాటి ఎపిసోడ్‌లో అభిజిత్ ఒక్కరే సేవ్ అయినట్టు ప్రకటించాడు.

మెహబూబ్ ఎలిమినేటెడ్..
పదోవారం నామినేషన్ ప్రక్రియ అవ్వడంతో అందరికీ ఎలిమినేషన్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. అయితే శనివారం రాత్రే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడంటూ లీకులు వచ్చాయి. నేటి ఉదయం అయితే ఏకంగా మెహబూబ్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ఫోటో కూడా లీకయ్యింది. ఇవన్నీ పక్కన బెడితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మెహబూబ్ ఎలిమినేట్ చేసినట్టు కన్ఫామ్ చేసేసింది.

చివరకు ఆ ఇద్దరే..
పదోవారం ఎలిమినేషన్‌లో చివరకు మెహబూబ్, సోహెల్ ఇద్దరే మిగిలారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కాబోతోన్నారని ఓ ప్రోమోలో చూపెట్టారు. అయితే రీసెంట్‌గా వచ్చిన ప్రోమోలో ఎలిమినేట్ అయింది ఎవరో చెప్పనకే చెప్పేశాడు. సోహెల్ ఏడుస్తూ మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టు చెప్పేశారు. ఇంట్లో మెహబూబ్ తప్ప అందరూ ఉన్నారు. హారిక, మోనాల్ ఏడ్చేస్తున్నారు.
ఓవర్ యాక్షన్..
అయితే మెహబూబ్ ఎలిమినేట్ అవ్వడంతో సోహెల్ ఉండబట్టలేకపోయాడు. భోరున ఏడ్చేశాడు. గత సీజన్లలో ఎలిమినేట్ అయ్యే సందర్భంలో కంటెస్టెంట్లు ఏడుస్తూ ఉంటే ఏంట్రా వీళ్ల ఓవర్ యాక్షన్ అని అనుకునే వాడ్ని కానీ ఇప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలుస్తోంది.ఇక్కడ మైండ్, మనసుతో కొట్లాడాలి సర్ అంటూ గుండెలవిసేలా ఏడ్చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











