ఆయన ఐడియాలు ఇస్తాడు కానీ పాటించడు.. అభిజిత్‌కు సోహెల్ పంచ్
బిగ్ బాస్ షోలో పదోవారం రచ్చ రచ్చగా మారింది. కెప్టెన్సీ టాస్కులో కంటెస్టెంట్లు ప్రవర్తించిన తీరుకు బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ ఆదేశాలను ఉల్లంఘించడం వల్ల కెప్టెన్సీ టాస్కును పూర్తిగా రద్దు చేశాడు. పదో వారానికి కెప్టెన్ అనే వారు ఉండరని తెలిపాడు. అనంతరం కంటెస్టెంట్లకు మరో టాస్క్ ఇచ్చాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి.. బయటకు పంపించండి అని ఓ టాస్క్ఇచ్చాడు. అలా అఖిల్‌ను సీక్రెట్ రూంలోకి పంపించాడు. అలా అఖిల్‌ను సీక్రెట్ రూంలో ఉంచి ఆటను ఆడిస్తున్నాడు. నేడు కూడా కంటెస్టెంట్లను ఓ ఆట ఆడించినట్టు కనిపిస్తున్నాడు.

సీక్రెట్స్.. లెటర్స్..
ఫ్యామిలీ మెంబర్స్ రాసిన ఉత్తరాలు కంటెస్టెంట్లు పొందాలంటే సీక్రెట్లు చెప్పాలని కండీషన్ పెట్టాడు. అలా తమ జీవితంలో ఎవ్వరికీ తెలియని సీక్రెట్లను చెప్పారు. దానికి సంతృప్తి చెందిన అఖిల్ సీక్రెట్ రూం నుంచి అందరికీ ఉత్తరాలను పంపించాడు. కానీ అరియానా, అవినాష్‌లు చెప్పినవి సీక్రెట్లు కావని లెటర్లను ముక్కముక్కలు చేశాడు.

నేడు మరో టాస్క్..
నేడు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మరో టాస్క్ ఇచ్చాడు. కుటుంబ సభ్యులు దీపావళి బహుమతులను పంపించారు. అవి మీ దగ్గరకు రావాలంటే నవ్వకుండ ఉండాలని చెప్పాడు. బిగ్ బాస్ ఇంట్లో నవ్వు నిషేధం అంటూ ఓ టాస్క్ పెట్టాడు. నవ్వకుండా ఎవరైతే ఉంటారో వారికే బహుమతులు లభిస్తాయని తెలిపాడు.

నవ్వించే ప్రయత్నం..
నవ్వకుండా ఉన్న కంటెస్టెంట్లను ఇతరులు నవ్వించేందుకు ప్రయత్నించాలని తెలిపాడు. ఏదో ఒకటి చేసి వారిని డిస్టర్బ్ చేయాలని టాస్క్ఇచ్చినట్టున్నాడు. ఇందులో భాగంగానే అవినాష్, సోహెల్, అభిజిత్ మిగతా ఇంటి సభ్యులను నవ్వించేందుకు విన్యాసాలు చేశారు.
Recommended Video

ఐడియాలు ఇచ్చాడు..
ఇంటి సభ్యులను నవ్వించేందుకు సోహెల్ జోకర్ గెటప్‌ను వేసుకున్నాడు. అభిజిత్ కామెడీ చేసేందుకు ప్రయత్నించాడు. ఈసారి ఏదైనా ఎలిమినేషన్ ప్లాన్, ఐడియా ఇవ్వమంటావా? అని అభిజిత్ నవ్వించేందుకు ప్రయత్నించాడు. ఆయన ఐడియాలు ఇస్తాడు పాటించడు అంటూ సోహెల్ సెటైర్ వేశాడు. అది కామెడీగానే అన్నా కూడా సోహెల్ మనసులో మాట బయట పెట్టినట్టున్నాడు.


Click it and Unblock the Notifications











